TS New Secretariat: నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. Live Updates
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నూతన సచివాలయ ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

Telangana New Secretariat Launch
TS New Secretariat: తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అన్ని రకాల సంప్రదాయాలతో పూజలు నిర్వహించారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సచివాలయానికి చేరుకున్నారు.
LIVE NEWS & UPDATES
-
మీ పని మీరు చేసుకోండి..
"మరుగుజ్జులారా ఇకనైనా మీ పని మీరు చేసుకోండి. నేడు తెలంగాణ ఆకాశమంత ఎదిగింది. కొందరు మరుగుజ్జులు ఇప్పటికైనా వారి కుళ్లును మానుకోవాలి. అంతర్జాతీయ నగరాలకు దీటుగా హైదరాబాద్ రూపుదిద్దుకుంటోంది" అని కేసీఆర్ అన్నారు.
-
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు
సమైక్య పాలనతో చాలా విధ్వంసం జరిగింది
తెలంగాణ ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతం
కొంతమంది మరుగుజ్జు మాటలు పట్టించుకోనవసరం లేదు
అంబేద్కర్ బాటలో తెలంగాణ పాలన
నాడు బీళ్లు..నేడు నిండుగా నీళ్లు
అపర భగరథుడే దిగివచ్చినట్లుంది
తెలంగాణ పునర్నిర్మాణానికి మిషన్ భగీరథ ప్రతీక
మిషన్ భగీరథతో ఫ్లోరైడ్ ను తరిమికొట్టాం
కోల్పోయిన అడవులు తిరిగి తెచ్చుకోవడం పునర్నిర్మాణమే
వలసలు వెళ్లిన పాలమూరు యువత తిరిగి వస్తున్నారు
ఇది కూడా తెలంగాణ పునర్నిర్మాణమే
ఇప్పుడు తెలంగాణ సాధించిన ప్రగతి అద్భుతం
తెలంగాణ పరిపాలనకు గుండెకాయ సెక్రటేరియట్
సెక్రటేరియట్ ను ప్రారంభించడం నా అదృష్టంగా భావిస్తున్నాం
-
పునర్నిర్మాణానికి మిషన్ భగీరథ ప్రతీక: సీఎం కేసీఆర్
తెలంగాణ పునర్నిర్మాణానికి మిషన్ భగీరథ ప్రతీక అని సీఎం కేసీఆర్ అన్నారు. ఆచరణకు యోగ్యమైన విధానాలతో 33 జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. సమ్మిళిత అభివృద్ధితో ముందుకు వెళ్తున్నామని అన్నారు. మన గ్రామాలు ఎన్నో అవార్డులు సాధించాయని తెలిపారు.
-
ఆరు ఫైళ్లపై సంతకాలు చేసిన సీఎం..
సీఎం కేసీఆర్ నూతన సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆశీనులైన తరువాత ఆరు ఫైళ్లపై సంతకాలు చేశారు. వాటిలో తొలుత పోడు భూముల దస్త్రంపై, ఇళ్లకు సంబంధించిన ఫైళ్లపై సంతకాలు చేశారు.
-
సీఎం కేసీఆర్ తన ఛాంబర్ లో ఆసీనులైన అనంతరం యాదాద్రి ఆలయానికి సంబంధించిన కాపీ టేబుల్ పుస్తకంతో పాటు కవిత నీరాజనం పుస్తకాన్ని ఆవిష్కరించారు. సీఎం కేసీఆర్ కు ఆలయ ఈవో గీత యాదాద్రి లడ్డూను అందజేశారు.
-
తొలి ఫైలుపై సంతకాలు చేసిన మంత్రులు..
నూతన సచివాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్ 6వ అంతస్తులోని సీఎం చాంబర్‌కు 1.30 గంటలకు చేరుకున్నారు. అక్కడ ఆశీనులై తొలి ఫైలుపై సంతకాలు చేశారు. ఇదే సమయంలో ఆయా శాఖల మంత్రులు నూతన సచివాలయంలోని వారికి కేటాయించిన ఛాంబర్స్‌లోకి వెళ్లి శాఖలకు సంబంధించిన తొలి ఫైలుపై సంతకాలు చేశారు.
-
తొలి సంతకం చేసిన సీఎం కేసీఆర్..
తెలంగాణ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అయింది. సీఎం కేసీఆర్ నూతన సచివాలయాన్ని ప్రారంభించారు. అనంతరం మధ్యాహ్నం 1.30 గంటలకు నూతన సచివాలయంలోని తన ఛాంబర్‌లో కూర్చొని తొలి ఫైలుపై సంతకం చేశారు. పేదల ఇళ్ల నిర్మాణానికి రూ. 3లక్షల ఆర్థిక సాయం, పోడు భూముల పంపిణీ ఫైళ్లపై కేసీఆర్ సంతకం చేశారు.
నూతన సచివాలయంలోని తన చాంబర్_లో తొలి ఫైలుపై సంతకం చేస్తున్న సీఎం కేసీఆర్
-
నూతన సచివాలయాన్ని ప్రారంభించిన కేసీఆర్..
నూతన సచివాలయంకు సీఎం కేసీఆర్ చేరుకున్నారు. వేద పండితులు పూర్ణకుంభంతో కేసీఆర్‌కు స్వాగతం పలికారు. అనంతరం పండితుల మత్రోచ్చారణల నడుమ శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసి నూతన సచివాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.
నూతన సచివాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్
-
నూతన సచివాలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్. స్వాగతం పలికిన వేముల ప్రశాంత్ రెడ్డి , సీఎస్ శాంతి కుమారి, డీజీపీ అంజనీ కుమార్. కాసేపట్లో కొత్త సచివాలయంను ప్రారంభించనున్న ముఖ్యమంత్రి
-
కొత్త సచివాలయంలో మంత్రులు తొలి సంతకాలు చేసే ఫైళ్లు ఇవే..
- పోడు భూముల పంపిణీపై సీఎం కేసీఆర్ తొలి సంతకం.
- డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపుపై కేటీఆర్ తొలి సంతకం .
- కొత్త పోలీస్ స్టేషన్ల మంజూరుపై హోమ్ మంత్రి మహమూద్ అలీ సంతకం.
- జంటనగరాల్లోని హిందూ దేవాలయాల్లో దూప దీప నైవేద్యాల ఫైల్ పై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సంతకం.
- శ్రమశక్తి అవార్డుల ఫైలుపై మల్లారెడ్డి సంతకం.
- అంగన్ వాడీలకు సన్నబియ్యం పంపిణీపై మంత్రి గంగుల కమలాకర్ సంతకం.
- రెండో విడత దళిత బంధు పధకం ఫైలుఫై సంతకం చేయనున్న మంత్రి కొప్పుల ఈశ్వర్.
- సీతారామ ప్రాజెక్టు ఫైల్ పై మంత్రి తన్నీరు హరీష్ రావు తొలి సంతకం.
- చెక్ డ్యామ్‌ల నిర్మాణం ఫైలుపై మంత్రి నిరంజన్ రెడ్డి సంతకం.
- కొత్త మండలాలకు ఐకేపీ భవన నిర్మాణాల అనుమతి ఫైలు పై మంత్రి ఎర్రబెల్లి తొలి సంతకం.
- అంగన్ వాడీ కేంద్రాల్లో ఒకటి మూడు సంవత్సరాల మధ్య ఉన్న చంటి పిల్లలకు ఉచితంగా పాలు పంపిణీ ఫైలు పై మంత్రి సత్యవతి రాథోడ్ సంతకం
- ఉచిత చేప పిల్లల పంపిణీ ఫైలుపై మంత్రి తలసాని తొలి సంతకం.
-
నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు..
తెలంగాణ ప్రభుత్వ నూతన సచివాలయం ప్రారంభం సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
- రాత్రి 8 గంటల వరకు హుస్సేన్ సాగర్ ,సైఫాబాద్, నెక్లెస్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు.
- ఎన్టీఆర్ గార్డెన్స్, ఎన్టీఆర్ ఘాట్, లుంబనీపార్క్, నెక్లెస్ రోడ్డును పూర్తిగా మూసి వేత.
- వీఐపీల రాకపోకలను బట్టి వీవీ విగ్రహం, నెక్లెస్ రోటరీ, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ వరకు ఇరువైపుల అప్పటి పరిస్థితులను బట్టి ట్రాఫిక్‌ను నిలిపివేయడం, మళ్లింపులు.
- ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ నుంచి వాహనాల రాకపోకలకు అనుమతి నిరాకరణ.
- ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి, బీఆర్‌కే భవన్ నుంచి ఎన్‌టీఆర్ మార్గ్ రూట్‌లో వాహనాలకు నో ఎంట్రీ. ట్యాంక్‌బండ్, కవాడిగూడ మీదుగా మళ్లింఫు
-
తెలంగాణ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కరణ
-
నూతన సచివాలయంలో తొలి సంతకం వాళ్ల కోసమే
-
నూతన సచివాలయం వద్ద పటిష్ట భద్రత ..
మరికొన్ని గంటల్లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సచివాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 600 మంది బెటాలియన్ సిబ్బందితో భద్రతను ఏర్పాటు చేశారు. రెండు షిఫ్ట్‌ల విధుల్లో 600 మంది పోలీస్ సిబ్బంది, అదనంగా 500 మంది పోలీసులు సచివాలయం పరిసరాల్లో అందుబాటులో ఉంటారు. సచివాలయం ప్రాంతంలో 300 సీసీ కెమెరాల ద్వారా భద్రతను పోలీస్ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు. ఆరు టీములు డాగ్ స్క్వాడ్ & బాంబ్ స్క్వాడ్లు ఉన్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించేలా రెండు అక్టోపస్ బృందాలను అందుబాటులో ఉంచారు. అదనపు పోలీస్ కమిషనర్ నేతృత్వంలో బందోబస్తు పర్యవేక్షణ కొనసాగుతోంది. ఇదిలాఉంటే, సెక్యూరిటీ బ్రీఫింగ్‌లో ఇప్పటికే పోలీస్ సిబ్బందికి ఉన్నతాధికారులు పలు సూచనలు చేశారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు వరకు సచివాలయం వద్ద పటిష్ఠ బందోబస్తు ఉంటుంది.
-
కొత్త సచివాలయంలో ఏఏ అంతస్తులో ఏఏ శాఖలంటే..?
గ్రౌండ్ ఫ్లోర్ ..
ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్ మెంట్
మైనారిటీల సంక్షేమ శాఖ
లేబర్ డిపార్ట్‌మెంట్
రెవెన్యూ డిపార్ట్‌మెంట్
రెవెన్యూ శాఖమొదటి అంతస్తు ..
గృహ విభాగం.
విద్యాశాఖ.
పంచాయతీరాజ్ విభాగం.రెండో అంతస్తు ..
వైద్య, ఆరోగ్యశాఖ
ఆర్థిక శాఖ
ఎనర్జీ డిపార్ట్‌మెంట్
పశు సంవర్ధకశాఖమూడవ అంతస్తు..
వ్యవసాయశాఖ
పురపాలక శాఖ
ఐటీ డిపార్ట్‌మెంట్
ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్
ప్రణాళికా విభాగం
గిరిజన సంక్షేమ శాఖ
మహిళా, శిశు సంక్షేమ శాఖ.నాలుగో అంతస్తు..
అటవీ పర్యావరణ శాఖ
లా డిపార్ట్‌మెంట్
యువజన సర్వీసుల శాఖ
బీసీ సంక్షేమ శాఖ
సీఏఎఫ్ డిపార్ట్‌మెంట్
నీటిపారుదల శాఖఐదవ అంతస్తు ..
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్
రహదారులు, భవనాల శాఖఆరవ అంతస్తు ..
ముఖ్యమంత్రి కార్యాలయం.
-
వైట్‌హౌస్‌ను తలపించేలా కొత్త సచివాలయం
-
మధ్యాహ్నం 1గంటకు సచివాలయానికి సీఎం కేసీఆర్..
తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారు జాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు, హోమాలు, యాగాలు ప్రారంభమయ్యాయి.
♦ సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 1గంట సమయంలో సచివాలయానికి చేరుకుంటారు. వేదపండితులు వేదమంత్రాలు, పూర్ణకుంభంతో సీఎం కేసీఆర్ కు స్వాగతం పలకనున్నారు.
♦ 1.20 నుంచి 1.32 గంటల సమయంలో పూర్ణాహుతి నిర్వహించి, అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం ఆరో అంతస్తుకు చేరుకొని చాంబర్ లో ఆసీనులై ఫైలుపై సంతకం చేస్తారు.
♦ మంత్రులందరూ తమతమ కార్యాలయాల్లో మధ్యాహ్నం 1.56 నిమిషాల నుంచి 2.04 నిమిషాల మధ్య ఆసీనులవుతారు.
♦ మధ్యాహ్నం 2.15 నిమిషాల నుంచి 2.45 నిమిషాల మధ్య సచివాలయం ఉద్యోగులు, మంత్రులను ఉద్దేశించి సీఎం కేసీఆర్ ప్రసంగిస్తారు.
♦ ఈరోజు నుంచే కొత్త సచివాలయం నుంచి అధికారిక కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి.
-
తెలంగాణ ప్రగతికి చిహ్నంగా నిలిచే డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారి చేతుల మీదుగా నేడు ప్రారంభం కానున్నది.#PrideOfTelangana pic.twitter.com/QgSFseGPcl
— BRS Party (@BRSparty) April 30, 2023
-
సచివాలయం ప్రత్యేకతలు..
తెలంగాణ ప్రభుత్వం నూతన సచివాలయం ప్రారంభ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1గంట సమయంలో సీఎం కేసీఆర్ నూతన సచివాలయానికి చేరుకుంటారు. సచివాలయాన్ని అద్భుతంగా నిర్మాణం చేపట్టారు.
- 28 ఎకరాల విస్తీర్ణం, 10,51,676 చదరపు అడుగులలో నూతన సచివాలయ భవన నిర్మాణం.
- భవనం ఎత్తు 265 అడుగులు, భవనంలో ఎనిమిది అంతస్తులు (లోయర్, గ్రౌండ్ ఫ్లోర్లతో కలిపి).
- 2 నుంచి 6 అంతస్తుల్లో సీఎం, మంత్రుల కార్యాలయాలు.
- 2.5లక్షల లీటర్ల సామర్థ్యంతో మినీ రిజర్వాయర్.
- సౌర ఫలకలతో సోలార్ విద్యుత్.
- నాలుగు దిక్కుల్లో ప్రధాన ద్వారాలు.
- 650 కార్లు, 500 ద్విచక్ర వాహనాలకు పార్కింగ్.
- అత్యాధునిక వసతులతో కాన్ఫరెన్స్ మరియు డైనింగ్ హాల్స్.
-
సచివాలయం ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా.. ఉదయం 5.50 గంటలకే పండితులు పూజా కార్యక్రమాలను ప్రారంభించారు. ఉదయం 6.15 గంటలకు సచివాలయానికి మంత్రి ప్రశాంత్ రెడ్డి దంపతులు సచివాలయానికి చేరుకున్నారు. వారు సుదర్శన యాగం, చండీ హోమాల్లో పాల్గొన్నారు. వాస్తు పూజలో కూడా ప్రశాంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. సచివాలయం ప్రారంభవేడుకల్లో పూజా కార్యక్రమాలు, యాగం, హోమాల నిర్వహణలో 110 మంది వేద పండితులు రుత్విక్కులు పాల్గొన్నారు.
-
తెలంగాణ చరిత్రలో అద్భుత ఘట్టం ఆవిష్కృతం అవుతుంది. తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీకగా నూతన సచివాలయం ప్రారంభ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సుదర్శన యాగంతో సెక్రటేరియట్ ప్రారంభోత్సవ వేడుక మొదలైంది.