Telangana Night Curfew: మరికొద్ది గంటల్లో తెలంగాణలో నైట్ కర్ఫ్యూ.. వేటికి అనుమతి.. మినహాయింపు ఎవరికి?

తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేలల్లో కరోనా కేసులు నమోదవతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ తప్పడం లేదు.

Telangana Night Curfew : తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ప్రతిరోజూ వేలల్లో కరోనా కేసులు నమోదవతున్నాయి. కరోనా కేసులు పెరుగుతుండటంతో నైట్ కర్ఫ్యూ తప్పడం లేదు. నిర్లక్ష్యంగానే ఉంటే లాక్ డౌన్ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో మళ్లీ నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఏప్రిల్ 20 మంగళవారం రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల దాకా కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. ఏప్రిల్ 30 వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగనుంది. నైట్ కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తామని సీపీ సజ్జనార్ స్పష్టం చేశారు.

నైట్ కర్ఫ్యూకి ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు. నైట్ కర్ఫ్యూ నుంచి మినహాయింపు పొందినవారు ఐడీ కార్డులు చూపించాలన్నారు. రాత్రి 8 గంటల తర్వాత అవసరం లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లకు టికెట్ లేకుండా వస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏప్రిల్ 30 తర్వాత పరిస్థితిని బట్టి కర్ఫ్యూ పొడిగింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు.

అత్యవసర సర్వీసులు తప్ప రెస్టారెంట్లు, బార్లు, షాపులు, కార్యాలయాలు తదితరాలు అన్ని రాత్రి 8 గంటలకు మూసి వేయాల్సి ఉంటుంది. కర్ఫ్యూ సమయంలో ఏయే సర్వీసులకు అనుమతి లేదు.. ఏయే సర్వీసులకు అనుమతి ఉంటుందో ఓసారి చూద్దాం..

మినహాయింపు సేవలు :
– ఫ్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా.
– టెలికమ్యూనికేషన్స్, ఇంటర్నెట్, IT సేవలు, కేబుల్ సర్వీసులు.
– పెట్రోల్, గ్యాస్ సరఫరా.
– విద్యుచ్ఛక్తి సరఫరా, నీటి సరఫరా & పారిశుధ్యం.
– ఈ- కామర్స్ ద్వారా వస్తువుల సరఫరా,
– ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీసులు
– కోల్డ్ స్టోరేజ్ లు.
– ప్రొడక్షన్ యూనిట్‌లు (నిరంతర ఉత్పత్తికి సంబంధించినవి).

మినహాయింపు ఎవరికంటే? :
– అత్యవసర సర్వీసులలో పనిచేసే వారు.
అత్యవసర విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ( ID కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే).
గర్భిణీ స్త్రీలకు, ఇతర పేషెంట్ లకు.
ఎయిర్ పోర్ట్ లు, రైల్వేస్టేషన్, బస్ స్టాండ్ కు వచ్చి, వెళ్ళే ప్రయాణీకులకు ( వారి టికెట్ల ఆధారంగా).
పబ్లిక్ ట్రాన్స్ పోర్టుతో పాటు ఆటోలు, ట్యాక్సీలు.
సరుకుల రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవు ( అంతర్ రాష్ట్ర సరఫరాతో సహా).
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై సెక్షన్లు 51 & 60 ( Disaster Management Act 2005 & సెక్షన్ 188 IPC ప్రకారం చర్యలు తీసుకుంటారు.

వీటికి అనుమతి లేదు :
– జనసంచారం
– పబ్ లు
– బార్లు
– రెస్టారెంట్లు
– షాపింగ్ మాల్స్

వీటికి అనుమతి :
– అత్యవసర సర్వీసులు
– అంతరాష్ట్ర రవాణా
– ఫార్మా రంగం
– ప్రొడక్షన్ యూనిట్లు
– ఈ-కామర్స్ సేవలు
– పెట్రోల్ పంప్ లు

ట్రెండింగ్ వార్తలు