CM KCR : ఢిల్లీలో సీఎం కేసీఆర్.. చివరి ప్రయత్నంగా కేంద్రంతో చర్చలు, విఫలమైతే

ఆ చర్చలు కూడా విఫలమైతే.. ఈ నెల 11న ఢిల్లీలో దీక్షకు దిగనున్నారు. దీక్షకు సంబంధించి టీఆర్ఎస్ శ్రేణులకు ఢిల్లీ నుంచే ఆయన మార్గ నిర్దేశం చేయనున్నట్లు...

Telangana Paddy Issue : తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో.. సతీమణ శోభ, కుమార్తె ఎమ్మెల్సీ కవితతో కలిసి ఢిల్లీ వెళ్లారు కేసీఆర్‌. పలువురు పార్టీ నేతలు కేసీఆర్‌ వెంట హస్తిన వెళ్లారు. మూడు రోజులు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. పంటి చికిత్సతో పాటు.. వరి ధాన్యం కొనుగోలు అంశంపై మరోసారి కేంద్రంతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ బాట పట్టినట్లు తెలుస్తోంది. ఈ నెల 11న సీఎం కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టనున్నారు. తాజాగా ఢిల్లీకి బయలుదేరిన కేసీఆర్.. చివరి ప్రయత్నంగా మరోసారి కేంద్రంతో చర్చలు జరిపేందుకు ప్రయత్నించనున్నట్లు తెలుస్తోంది.

Read More : Rahul Gandhi Key Meeting : తెలంగాణపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్.. రేపు రాహుల్ గాంధీ కీలక సమావేశం

ఒకవేళ ఆ చర్చలు కూడా విఫలమైతే.. ఈ నెల 11న ఢిల్లీలో దీక్షకు దిగనున్నారు. దీక్షకు సంబంధించి టీఆర్ఎస్ శ్రేణులకు ఢిల్లీ నుంచే ఆయన మార్గ నిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో ఇతర రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు కూడా కేసీఆర్ ప్రయత్నాలు చేయనున్నట్లు సమాచారం. ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్‌.. ప్రధాని మోదీని కలుస్తారని తెలుస్తోంది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం మొండి వైఖరి వీడాలని విజ్ఞప్తి చేస్తారని సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే పీఎం అపాయింట్‌మెంట్‌ కూడా కోరినట్లు తెలుస్తోంది.

Read More : Vemula Prasanth Reddy: బీజేపీ ప్రభుత్వం వల్లే తెలంగాణ రైతులకు సమస్య: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

మరోవైపు..ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది. ఇక కేంద్రంతో సమరమేనని.. తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయింది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టనుంది గులాబీదండు. 2022, ఏప్రిల్ 04వ తేదీ సోమవారం నుంచి ఈ నెల 11 వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌. దీంతో.. మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టనున్నాయి టీఆర్‌ఎస్‌ శ్రేణులు.

ట్రెండింగ్ వార్తలు