TRS Party : ధాన్యం దంగల్.. ఇక సమరమే అంటున్న గులాబీ దళం

ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఆగడం లేదు. టీఆర్ఎస్‌-బీజేపీ నేతల పరస్పర విమర్శలతో రాష్ట్రంలో వరి రాజకీయం వేడెక్కింది. తెలంగాణ పాలిటిక్స్‌...

Ktr

Telangana Paddy Issue : ధాన్యం కొనుగోళ్ల వ్యవహారంలో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమైంది. ఇక కేంద్రంతో సమరమేనని.. తాడోపేడో తేల్చుకునేందుకు రెడీ అయింది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టనుంది గులాబీదండు. 2022, ఏప్రిల్ 04వ తేదీ సోమవారం నుంచి ఈనెల 11వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చారు టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌. దీంతో.. ఇవాళ మండల కేంద్రాల్లో నిరసన దీక్షలు చేపట్టనున్నాయి టీఆర్‌ఎస్‌ శ్రేణులు.

Read More : CM KCR : ఢిల్లీలో సీఎం కేసీఆర్.. చివరి ప్రయత్నంగా కేంద్రంతో చర్చలు, విఫలమైతే

ధాన్యం సేకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం ఆగడం లేదు. టీఆర్ఎస్‌-బీజేపీ నేతల పరస్పర విమర్శలతో రాష్ట్రంలో వరి రాజకీయం వేడెక్కింది. తెలంగాణ పాలిటిక్స్‌ మొత్తం ధాన్యం చూట్టూ తిరుగుతున్నాయి. ధాన్యం కొనాలంటూ పలుసార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడంతో.. పోరాట కార్యాచరణను ఉధృతం చేయాలని నిర్ణయించింది టీఆర్‌ఎస్‌. ఓ వైపు కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా రాష్ట్రంలో నిరసనలు కొనసాగిస్తూనే.. ఢిల్లీలో పార్లమెంట్‌ లోపల, బయట ఆందోళనలు నిర్వహించాలని నిర్ణయించింది టీఆర్ఎస్‌ పార్టీ.
6వ తేదీన నాలుగు జాతీయ రహదారుల దిగ్బంధం, ఏప్రిల్ 7న 32 జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. 8న రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై నల్ల జెండా ఎగురవేయాలని.. కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని పిలుపునిచ్చింది టీఆర్‌ఎస్‌. ఏప్రిల్ 11న ఢిల్లీలో టీఆర్ఎస్ ధర్నా చేయనున్నారు కారు పార్టీ నేతలు.

Read More : Piyush Goyal On Rice : ఒక స్థాయి వరకే సహకారం ఇవ్వగలం-పీయూష్ గోయల్

మరోవైపు.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో.. సతీమణ శోభ, కుమార్తె ఎమ్మెల్సీ కవితతో కలిసి ఢిల్లీ వెళ్లారు కేసీఆర్‌. పలువురు పార్టీ నేతలు కేసీఆర్‌ వెంట హస్తిన వెళ్లారు. మూడు రోజులు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. పంటి చికిత్సతో పాటు.. వరి ధాన్యం కొనుగోలు అంశంపై మరోసారి కేంద్రంతో చర్చించేందుకు ఆయన ఢిల్లీ బాట పట్టినట్లు తెలుస్తోంది.