Piyush Goyal On Rice : ఒక స్థాయి వరకే సహకారం ఇవ్వగలం-పీయూష్ గోయల్

ఒక స్థాయి వరకు మాత్రమే సహకారం, మద్దతు ఇవ్వగలం అన్న ఆయన... అంతకు మించి ఇవ్వడం ఏ దేశానికి సాధ్యం కాదన్నారు. అంతిమంగా మన కాళ్లపై..

Piyush Goyal On Rice : ఒక స్థాయి వరకే సహకారం ఇవ్వగలం-పీయూష్ గోయల్

Piyush Goyal On Rice

Updated On : April 3, 2022 / 4:43 PM IST

Piyush Goyal On Rice : తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులకు ప్రోత్సాహకాలు, సబ్సిడీలపై కేంద్ర వాణిజ్య ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ స్పందించారు. ఎటువంటి సబ్సిడీలు గ్రాంట్లు లేకుండానే ఎగుమతుల్లో రికార్డులు సాధించామని ఆయన తెలిపారు. అదే పద్ధతిలో ముందుకు సాగాలన్నారు. ఒక స్థాయి వరకు మాత్రమే సహకారం, మద్దతు ఇవ్వగలం అన్న ఆయన… అంతకు మించి ఇవ్వడం ఏ దేశానికి సాధ్యం కాదన్నారు.

Telangana : తెలంగాణ ప్రజలను అవమాన పరిచిన పీయూష్ గోయెల్ క్షమాపణ చెప్పాలి : హరీశ్ రావు

అంతిమంగా మన కాళ్లపై మనమే నిలబడాలని అన్నారు. నాణ్యతా ప్రమాణాలు, పోటీతత్వం కారణంగా ఎగుమతుల్లో భారత్ అగ్ర స్థానంలో ఉందని కేంద్రమంత్రి చెప్పారు. ఇదే పద్ధతిలో ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాం అన్నారు. ఎగుమతుల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తాం అనుకుంటున్నాం అని చెప్పారు.

Telangana : పార్లమెంటు సాక్షిగా పీయూష్ గోయల్ వి బరితెగింపు వ్యాఖ్యలు : మంత్రి నిరంజన్ రెడ్డి