Telangana : తెలంగాణ ప్రజలను అవమాన పరిచిన పీయూష్ గోయెల్ క్షమాపణ చెప్పాలి : హరీశ్ రావు

తెలంగాణ ప్రజలను అవమాన పరిచిన మంత్రి పీయూష్ గోయెల్ క్షమాపణ చెప్పాలి అని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Telangana : తెలంగాణ ప్రజలను అవమాన పరిచిన పీయూష్ గోయెల్ క్షమాపణ చెప్పాలి : హరీశ్ రావు

Minister Harish Rao Demands Apology From Piyush Goyal

minister Harish Rao demands apology from Piyush Goyal : వరి ధాన్యం కొనుగోళ్లు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి..తెలంగాణకు మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం నడుస్తోంది. బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ మంత్రులు విరుచుకుపడుతున్నారు. దీంట్లో భాగంగా మంత్రి హరీశ్ రావు కేంద్రంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ధాన్యంసేకరణలో తెలంగాణాలో అవకతవకలు జరిగాయని మంత్రిపీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తంచేస్తూ..కేంద్రమంత్రి పీయూష్ గోయెల్ తెలంగాణ రాష్ట్ర రైతులను అవమాన పరిచారని..తెలంగాణ మంత్రులు రా రైస్ అడిగితే నూకలు తినడం అలవాటు చేసుకోవాలంటూ అవమానకరంగా మాట్లాడారని ఫైర్ అయ్యారు. తెలంగాణా ప్రజలను అవమాన పరిచిన మంత్రి పీయూష్ గోయెల్ క్షమాపణ చెప్పాలి అని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు.

Also read : Piyush On Paddy Procurement : ధాన్యం సేకరణలో ఏపీ, తెలంగాణలో అవకతవకలు- పీయూష్ గోయల్

మా మంత్రులను అవమానపరచటమే కాకుండా తెలంగాణ రైతులను కూడా అవమానపరుస్తున్నారని..ఈ రోజు పార్లమెంట్ లో మరోసారి రైతులను కించ పరిచేలా మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యలు చేయటం సరికాదన్నారు. రైతుల కోసం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా అమలు చేయడం లేదని ఇది సరిపోదా తెలంగాణలో రైతుల కోసం ప్రభుత్వం చేసేది అంటూ ప్రశ్నించారు. తెలంగాణా ప్రజలను అవమాన పరిచిన మంత్రి పీయూష్ గోయెల్ క్షమాపణ చెప్పాలి అని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. దేశంలో సీడ్ 80 శాతం తయారు చేస్తాం….ఇతర రాష్ట్రాల్లో ఇది సాధ్యమా?
రబీలో మా ద్గర వచ్చేవే బాయిల్డ్ రైస్ అని తెలిపారు. పంటల సాగును ఇతర రాష్ట్రాలతో పోల్చడం సరికాదని..పంజాబ్ కు తెలంగాణకు లింకు పెడతారా?అని ప్రశ్నించారు.

రైతు సమస్యలను కేంద్రం అస్సలు పట్టించుకోవడం లేదు అని విమర్శించారు హరీశ్ రావు. కేంద్రమంత్రి గా బాధ్యత యుతమైన పదవిలో ఉంటూ పీయూష్ గోయల్ ఇలా బాధ్యత రాహిత్యంగా వ్యవహరించడం తగదుని సూచించారు. పీయూష్ గోయెల్ అన్ని అబద్దాలు మాటలు మాట్లాడుతున్నారని..ప్రశ్నించినవారిపై ఐడి, సీబీఐ దాడులు అంటూ భయభ్రాంతులకు గురిచేయడం బీజేపీ సంస్కృతి అని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో నేతలుగానే బీజేపీ నేతలు మాట్లాడుతున్నారుని..బీజేపీ అధికారంలోకి రాకముందు ఓ మాట తరువాత మరో మాట మాట్లాడుతోందన్నారు.బీజేపీ రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని..చేశామని చెప్పుకుంటోందని కాని అది రెట్టింపు ఆదాయం కాదు..రెట్టింపు ఖర్చులు చేశారని విమర్శించారు.

Also read : Telangana : పార్లమెంటు సాక్షిగా పీయూష్ గోయల్ వి బరితెగింపు వ్యాఖ్యలు : మంత్రి నిరంజన్ రెడ్డి

నడి రోడ్డుపై రైతులపై కార్లు ఎక్కించిన చరిత్ర బీజేపీది అంటూ విరుచుకుపడ్డారు. నల్ల చట్టాలను ముందే వెనక్కు తీసుకుంటే 700 మంది రైతులు మరణించే వారు కాదా…రైతులు ఏడాది పాటు నిససనలు చేస్తే ఎన్నికల ముందు రాజకీయ లబ్ది కోసం వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని అన్నారు.ఎన్నికల కోసమే ధరలు తగ్గింపులు…తరువాత ధరలు బాదుడు బీజేపీ నైజం అన్నారు. ప్రధాని మోడీ కూడా తెలంగాణ ను అవమాన పరిచారుని..తెలంగాణ రైతులకు డబ్బులు చెల్లించం అని చెప్పడం బాధాకరం అని అన్నారు.11 లక్షల కోట్లు బడా పారిశ్రామిక వేత్తల రుణాలు రద్దు చేయడంతోనే బీజేపీ ప్రభుత్వం ఎవరి పక్షమో తెలుస్తోందంటూ ఎద్దేవా చేశారు హరీశ్ రావు.కేంద్ర ప్రభుత్వానికి కార్పొరేట్ల పై ఉన్న ప్రేమ రైతులపై లేదని..అన్నారు.

బీజేపీ రైతుల ఉసురు పోసుకుంటుందన్నారు. టి.బీజేపీ నేతలు కేంద్రాన్ని ఒప్పించాలి… లేదంటే తెలంగాణ ప్రజాగ్రహానికి గురికాక తప్పదుని హెచ్చరించారు.దేశవ్యాప్తంగా ఎన్నో రాష్ట్రాలు కరెంటు కొతలు విధిస్తున్నాయి
..అయినా తెలంగాణా లో 24 గంటల కరెంట్ ఇస్తున్న ఘనత మాది అన్నారు.తెలంగాణ అభివృద్ధిని చూసి బీజేపీ ఓర్వలేక పోతోంది అని..అందుకే కొత్త సమస్యలు సృష్టిస్తోంది మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.