Telangana : పార్లమెంటు సాక్షిగా పీయూష్ గోయల్ వి బరితెగింపు వ్యాఖ్యలు : మంత్రి నిరంజన్ రెడ్డి
ధాన్యంసేకరణలో AP, తెలంగాణాలో అవకతవకలు జరిగాయని మంత్రిపీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి కౌంటరిచ్చారు.పార్లమెంటు సాక్షిగా మంత్రి బరితెగింపు మాటలాడారన్నారు.

Ts Minister Niranjan Reddy Strang Counter To Union Minister Piyush Goyal
TS Minister Niranjan reddy strang counter to union minister piyush goyal : ధాన్యం సేకరణలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలో అవకతవకలు జరిగాయని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. పార్లమెంటు సాక్షిగా పీయూష్ గోయల్ బరితెగింపు మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై అవే పాత అబద్దాలే వల్లె వేశాడని.. సభ సాక్షిగా కొందరు ముఖ్యమంత్రులు బెదిరించారని చెప్పడం అప్రజాస్వామికం అంటూ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు యూపీఎ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. మరి నాడు మోడీ చేసింది బెదిరింపేనా ? అంటూ నిలదీశారు. కేంద్రం కొనుగోళ్ల బాధ్యత వదిలేసి రాష్ట్రాలు కొనుగోలు చేసుకోవచ్చంటూ చేతులెత్తేయడం రాజ్యాంగ విరుద్దం అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్న పీయూష్ గోయెల్ కు పదవిలో ఉండే అర్హత ఉందా? అని ప్రశ్నించారు. రైతులకు మంత్రి, కేంద్ర ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. కేంద్రం రాసుకున్న ఫార్మాట్ లో రాష్ట్రాల నుండి బలవంతంగా లేఖలు తీసుకుని బాయిల్డ్ రైస్ ఇవ్వమని లేఖ ఇచ్చారనడం దుర్మార్గం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా మంత్రి పీయూష్ గోయల్ ధాన్యం సేకరణలో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణాలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. రాజ్యసభలో ఎంపి జీవీఎల్ నరసింహరావు అడిగిన ప్రశ్నకు సమాధానంగా..ధాన్యం సేకరణ అవకతవకలపై ఆయా రాష్ట్ర ప్రభుత్వాలనే విచారణ చేయాల్సిందిగా కోరామన్నారు మంత్రి పీయూష్ గోయల్.
రాష్ట్ర ప్రభుత్వాలే అవకతవకలకు కారణమని, వాటి విచారణ వల్ల ఉపయోగం లేదని, కేంద్ర ప్రభుత్వమే స్వతంత్రంగా విచారణ చేపట్టాలని జీవిఎల్ డిమాండ్ చేశారు. రైతులకు ధాన్యం సేకరించిన మూడు నెలలకు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించట్లేదని, తీవ్ర జాప్యం చేస్తోందని, దీనిపై కూడ విచారణ జరపాలని కేంద్రమంత్రిని కోరారు జీవీఎల్.
రైతుకు ధాన్యం సేకరించిన వెంటనే డబ్బు చెల్లించాలన్న ఉద్దేశ్యంతో రాష్ట్రాలకు 90 శాతం ధాన్య సేకరణ సొమ్ము ముందుగానే ముందస్తు రూపంలో ప్రధాన మోడీ గారి అదేశాల మేరకు చెల్లిస్తునామని, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలస్యం చేస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.