Telangana E Pass
Telangana E-Pass : కరోనా కట్టడి కోసం అన్ని రాష్ట్రాల్లోనూ లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి ప్రభుత్వాలు. పోలీసులు లాక్ డౌన్ నిబంధనలను స్ట్రిక్ట్ గా అమలు పరుస్తున్నారు. రాష్ట్ర సరిహద్దులు సైతం మూసివేశారు. రాష్ట్రంలోకి ప్రవేశించాలంటే ఈ-పాస్ తప్పనిసరి చేశారు పోలీసులు. ముందుగా ఆన్ లైన్ లో ఈ-పాస్ కోసం అప్లయ్ చేసుకోవాలి. అక్కడ పర్మిషన్ వచ్చిన తర్వాతే జర్నీ చేయాలి. ఆ ఈ-పాస్ చూపిస్తేనే పోలీసులు రానిస్తున్నారు.
ఈ క్రమంలో ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వచ్చే ప్రయాణికులకు తెలంగాణ పోలీసులు శుభవార్త చెప్పారు. అలాంటి వారికి ఆన్‌లైన్‌లో ఈ-పాస్ పొందే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇందుకోసం తెలంగాణ పోలీస్ వెబ్‌సైట్‌లో మంగళవారం(మే 25,2021) కొత్త ఫీచర్‌ను జోడించారు. ఇకపై పొరుగు రాష్ట్రాల నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని తెలంగాణలోకి ప్రవేశించొచ్చు. ఈ మేరకు కొత్త ఫీచర్‌లో ఆరు రకాల ప్రయాణికులకు ఈ-పాస్ జారీ చేసేందుకు వెసులుబాటు కల్పించారు.
ఇప్పటివరకు పొరుగు రాష్ట్రాల పోలీస్‌శాఖల నుంచి జారీ చేసే పాస్‌లతోనే తెలంగాణలో ప్రవేశించేందుకు అనుమతిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశాల నుంచి ఎక్కువగా ప్రయాణికులు తెలంగాణలోకి వస్తున్నారు. అయితే కర్ణాటక రాష్ట్ర యంత్రాంగం తెలంగాణలోకి వచ్చేందుకు ఈ-పాస్‌ల జారీ ప్రక్రియను నిలిపివేసింది. అలాగే మిగతా రాష్ట్రాల్లోనూ సాంకేతిక కారణాలతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో డీజీపీ మహేందర్‌రెడ్డి ఈ దిశగా నిర్ణయం తీసుకున్నారు.
ఈ-పాస్ ఎవరెవరికి ఇస్తారంటే..
* కుటుంబసభ్యులు మరణిస్తే అంత్యక్రియలకు హాజరయ్యేందుకు, ఆసుపత్రిలో చికిత్స కోసం
* జాతీయ/అంతర్జాతీయ విమాన ప్రయాణికులను ఎయిర్ పోర్టులో దింపేందుకు
* ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన విద్యార్థులు తిరిగొచ్చేందుకు
* రాష్ట్రానికి చెందిన కుటుంబాలు వచ్చేందుకు
* తెలంగాణలో వివాహానికి హాజరు కావడానికి