TS Police : ఏపీ-తెలంగాణ సరిహద్దుల్లో పోలీసుల ఆకస్మిక దాడి.. ఏడుగురు అరెస్ట్, 46 బైక్స్ సీజ్

తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో కోళ్లపందాలు నిర్వహిస్తున్నారని పక్క సమాచారం రావడంతో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు.

Ts Police

TS Police : తెలంగాణ ఆంధ్ర సరిహద్దుల్లో కోళ్లపందాలు నిర్వహిస్తున్నారని పక్క సమాచారం రావడంతో పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఏపీ సరిహద్దు గ్రామమైన ముల్కలపల్లి గత కొంత కాలంగా గుట్టు చప్పుడు కాకుండా కోడిపందాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు శుక్రవారం దాడి చేశారు. మొత్తం ఏడుగురు పందెం రాయుళ్లను 46 బైక్స్, 15 కోళ్లు, రూ.14,970 స్వాధీనం చేసుకొని ముల్కలపల్లి పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

చదవండి : Panjab Police : పంజాబ్ సరిహద్దులో టిఫిన్ బాంబు స్వాధీనం

కాగా పాల్వంచ సబ్ డివిజన్ ఇంచార్జ్ ఐపీఎస్ రోహిత్ రాజు ఆధ్వర్యంలో స్పెషల్ పోలీస్ స్క్వాడ్ టీమ్స్ మెరుపు దాడులు నిర్వహించింది. ఇందులో ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు వ్యక్తులు టీమ్‌గా ఏర్పడి కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక పోలీసులను చూసి మరికొందరు పరారైనట్లు తెలిపారు. పరారీలో ఉన్నవారికోసం సెర్చ్ ఆపరేషన్ స్టార్ట్ చేసినట్లు ఐపీఎస్ రాజు వివరించారు.

చదవండి : Hyderabad Police : సౌండ్ పొల్యూషన్‌పై హైదరాబాద్ పోలీసుల కొరడా