తెలంగాణాలో ఎంసెట్ సహా అన్ని ప్రవేశ పరీక్షలను ప్రభుత్వం వాయిదా వేసింది.ఎంసెట్ తో సహా..పాలిసెట్, ఐసెట్,లాసెట్,పీజీ,ఎడ్ సెట్,ఎల్ సెట్ ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లుగా హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది.
వివరాల్లోకి వెళితే..తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లో రెండు వారాలపాటు లాక్‌డౌన్ పెట్టే యోచనలో ఉన్నట్టు వార్తలు రావడంతో… ఎంట్రెన్స్ పరీక్షలు వాయిదా వేయాలని పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు… హైదరాబాద్‌లో లాక్‌డౌన్ పెడితే ఎంట్రెన్స్ పరీక్షలు ఏ విధంగా నిర్వహిస్తారని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అయితే లాక్‌డౌన్ ఉంటుందా లేదా అన్నది కేబినెట్ నిర్ణయంపై ఆధారపడి ఉందని తెలిపిన ఏజీ(అడ్వకేట్ జనరల్) హైకోర్టుకు తెలిపారు.
ఒకటి, రెండు రోజుల్లో కేబినెట్ సమావేశం ఉంటుందని..దీనికి సంబంధించని అన్ని అంశాలను కేబినెట్ సమావేశం చర్చిస్తుందని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఏసీ. ప్రవేశ పరీక్షల వాయిదాపై మధ్యాహ్నం 2.30గంటలకు నిర్ణయం చెబుతామని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈక్రమంలో తెలంగాణలో ఎంసెట్ పరీక్షలతో సహా అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లుగా హైకోర్టుకు ఏజీ తెలిపారు.
కాగా..షెడ్యూల్ ప్రకారం తెలంగాణలో జూలై 6 నుంచి 9వ తేదీవరకు ఎంసెట్- 2020 పరీక్ష జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం జూలై 6, 7, 8 తేదీలలో ఇంజినీరింగ్ విభాగం, జూలై 8, 9 తేదీలలో అగ్రికల్చర్ విభాగంలో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ విధిస్తే.. ఎంసెట్ పరీక్ష నిర్వహణ ఎలా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.