Telangana Ration Card: తెలంగాణలో కొత్తగా కార్డులు పొందిన వారు తమ వివరాలను సెప్టెంబర్ 25వ తేదీలోగా అప్‌డేట్ చేయకపోతే వారికి వచ్చే నెలలో బియ్యం అందదు. అంటే మీకు రేషన్‌కార్డు ఉన్నప్పటికీ అక్టోబరులో రేషన్ ఇవ్వరు.
కొత్తగా రేషన్ కార్డులు అందుకున్న వారి వివరాలను ప్రతి నెల బియ్యం పంపిణీ కోసం అప్‌డేట్ చేస్తున్నారు. అప్‌డేట్ చేయించుకున్న వారికి మాత్రమే మరుసటి నెల బియ్యం పంపిణీ చేస్తున్నారు. (Telangana Ration Card)
తాజాగా సూర్యాపేటలోని ఓ మహిళకు రేషన్‌కార్డు వచ్చింది. అయితే, అప్‌డేట్ చేయించుకోకపోవడంతో దుకాణంలో బియ్యం అందలేదు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ఆగస్టు 25లోపు రేషన్ కార్డు సమాచారం అప్డేట్ చేయించుకున్న వారికే సెప్టెంబర్‌లో రేషన్ ఇస్తారని తెలిపారు.
అలాగే, అక్టోబర్ నెలలో రేషన్ కావాలంటే సెప్టెంబర్ 25లోగా పేర్లు అప్‌డేట్ చేసుకోవాలి. మీ రేషన్ దుకాణాదారుడి వద్దకు వెళ్తే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.
రేషన్ కార్డుల కోసం మీసేవలో దరఖాస్తు చేసుకున్న వారికి దశల వారీగా అవి అందుతున్నాయి. ఈ ఏడాది జూన్‌లో 3 నెలలకు సంబంధించిన బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేసిన విషయం తెలిసిందే. వారిలో కొత్త కార్డులు పొందినవారు కొంత మందే ఉన్నారు.
ఈ 3 నెలల కాలంలో కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వారికి సెప్టెంబరు నెల నుంచి బియ్యం పంపిణీ అవుతుంది. కార్డు అప్‌డేట్ చేయించుకుంటే బియ్యం పొందొచ్చు. రేషన్ కార్డు అప్‌డేట్ ప్రక్రియను ఏఎస్ఓ ఆఫీసులు ప్రతి నెల 25 లోపు పూర్తిచేస్తాయి. ఆ తేదీ దాటాక నమోదు చేసుకునేవారికి వచ్చే నెల నుంచి బియ్యం అందుతుంది.