×
Ad

Covid Update : తెలంగాణలో కొత్తగా 11 కోవిడ్ కేసులు నమోదు

తెలంగాణలో ఈరోజు కొత్తగా 11 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,91,630కి చేరింది.

  • Published On : April 17, 2022 / 09:41 PM IST

Ts Covid Update

Covid Update :  తెలంగాణలో ఈరోజు కొత్తగా 11 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇంతవరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 7,91,630కి చేరింది. అదే సమయంలో 29 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇంతవరకు రాష్ట్రంలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 7,87,313 కిచేరింది. ఈరోజు రాష్ట్రంలో కోవిడ్ వల్ల ఎవరూ మరణించలేదని ప్రజారోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో తెలిపింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 222 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కోవిడ్ రికవరీ రేటు 99.45 శాతంగా ఉంది. ఇంతవరకు తెలంగాణలో 3,44,52,755 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈరోజు అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 9 కేసులు నమోదు కాగా,. మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.
Also Read : Drugs Case : పుడ్డింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసులో ముగిసిన నిందితుల కస్టడీ