Telangana Corona Cases
Telangana Corona Cases: తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్త కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 68వేల 720 కరోనా పరీక్షలు చేయగా 1,380 మందికి పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య 7,78,910కి చేరింది. తాజాగా మరొకరు కోవిడ్ తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,101కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 24వేల యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 96.39గా ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 350 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. ఆదివారంతో(1217) పోలిస్తే సోమవారం కరోనా కేసులు పెరిగాయి.
Tea Bags : టీ బ్యాగ్స్ వాడుతున్నారా?…మీ ఆరోగ్యం డేంజర్‌లో పడ్డట్టే…
థర్డ్ వేవ్ రూపంలో భారత్‌పై కరోనా మహమ్మారి (ఒమిక్రాన్ వేరియంట్) విరుచుకుపడింది. కొన్ని రోజుల క్రితం భారీ సంఖ్యలో కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే, ఇప్పుడు మళ్లీ కోవిడ్ తీవ్రత తగ్గుముఖం పట్టింది. కొత్త కేసులు భారీగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంట్లలో దేశంలో కోవిడ్ కేసులు భారీగా తగ్గాయి. లక్ష దిగువకు వచ్చాయి.
కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 83వేల 876 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు 11,56,363 కరోనా టెస్టులు చేశారు. మరో 895 మంది కోవిడ్ బాధితులు ప్రాణాలు విడిచారు. ఇదే సమయంలో 1,99,054 మంది కోవిడ్ బాధితులు పూర్తి స్థాయిలో కోలుకున్నారు.
Facebook: ఫేస్‌బుక్‌కి రూ.1500కోట్ల జరిమానా.. ఎందుకంటే?
కాగా, థర్డ్ వేవ్ విజృంభణ మొదలైన తర్వాత జనవరి 6వ తేదీ నుంచి లక్ష మార్క్‌కు దిగువగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఇక, దేశవ్యాప్తంగా ప్రస్తుతం 11,08,938 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు కోవిడ్ తో మృతి చెందిన వారి సంఖ్య 5,02,874కు చేరింది. రికవరీల కేసుల సంఖ్య 4,06,60,202కు పెరగగా.. భారత్‌లో ఇప్పటివరకు 1,69,63,80,755 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు.
మరోవైపు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ మన దేశంలో అందుబాటులోకి వచ్చింది. అత్యవసర వినియోగం కోసం సింగిల్ డోస్ స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. స్పుత్నిక్ లైట్ వ్యాక్సిన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర ఉపయోగం కోసం అనుమతించబడిన ప్రపంచ వ్యాక్సిన్. మన దేశంలో అత్యవసర ఉపయోగం కోసం అనుమతించబడిన తొమ్మిదవ వ్యాక్సిన్ స్పుత్నిక్ లైట్.
కరోనా వైరస్‌కి ఇప్పటివరకు రెండు డోసుల వ్యాక్సిన్ వేయాల్సి ఉంది. అయితే, రష్యా ఆమోదించిన స్పుత్నిక్- V వ్యాక్సిన్ లైట్ వెర్షన్, ఒక మోతాదు చాలు. కరోనా వైరస్‌పై పని చేస్తుంది. వైరస్‌కు వ్యతిరేకంగా 79.4శాతం ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీని ధర రూ.730 కంటే తక్కువే ఉండొచ్చు. జనవరి 2021లో కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లను అత్యవసర వినియోగం కోసం మొదట ఆమోదించగా.. దీని తర్వాత, మరో ఆరు వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి లభించింది. ఇప్పుడు తొమ్మిదవ వ్యాక్సిన్ స్పుత్నిక్ లైట్ అందుబాటులోకి వచ్చింది. దేశంలో ఇదే తొలి సింగిల్ డోస్ వ్యాక్సిన్.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.07.02.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/XrbdmkJ9Jq— IPRDepartment (@IPRTelangana) February 7, 2022