Tea Bags : టీ బ్యాగ్స్ వాడుతున్నారా?…మీ ఆరోగ్యం డేంజర్లో పడ్డట్టే…

టీలు తాగటం అన్నది ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు సూచిస్తున్నప్పటికీ, బ్యాగ్స్ లో ఉండే వాటితో టీ తయారుచేసుకుని తాగటం వల్ల అనారోగ్యాన్ని కోరితెచ్చుకున్న వాళ్లవుతారని హెచ్చరిస్తున్నారు.

Tea Bags : టీ బ్యాగ్స్ వాడుతున్నారా?…మీ ఆరోగ్యం డేంజర్లో పడ్డట్టే…

Tea Bags

Tea Bags : నిత్యం టీ తాగదానిదే ఏ పని మొదలుపెట్టరు చాలా మంది. మనం ఇంట్లో నచ్చిన టీ పొడి వేసుకొని టీ తాగితే పర్వాలేదు. కానీ ఇటీవలి కాలంలో మార్కెట్లో వివిధ బ్రాండ్లతో కూడిన టీ బ్యాగులు అందుబాటులోకి వచ్చాయి.కాఫీ , టీ , గ్రీన్ టీ పొడిలకు సంబంధించిన టీబ్యాగులను కొనుగోలు చేసుకుని త్వరగా టీ తయారు చేసుకుని తాగటాన్ని చాలా మంది అలవాటుగా మార్చుకున్నారు. టీ పెట్టుకునేంత సమయం లేకపోవటం, ఓపిక అంతకాన్నా లేకపోవటంతో త్వరితగతిన పనిపూర్తయ్యే మార్గాలను చాలా మంది వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే టీ బ్యాగులకు అలవాటై పోయారు.

టీలు తాగటం అన్నది ఆరోగ్యానికి మంచిదేనని నిపుణులు సూచిస్తున్నప్పటికీ, బ్యాగ్స్ లో ఉండే వాటితో టీ తయారుచేసుకుని తాగటం వల్ల అనారోగ్యాన్ని కోరితెచ్చుకున్న వాళ్లవుతారని హెచ్చరిస్తున్నారు. నిపుణులు. త్వరగా పూర్తవుతాయని పొడివేసుకుని కషాయాన్ని కాగబెట్టుకోవటానికి బదులుగా బ్యాగులను వాడటం వల్ల ఆరోగ్యానికి హానికలుగుతుందని పరిశోధనల్లో తేలింది. దీని వల్ల అనారోగ్యాన్ని కొని తెచ్చుకున్నట్లే అవుతుంది.

మైక్రో ప్లాస్టిక్ తో తయారయ్యే ఈ టీ బ్యాగులను వినియోగించటం వల్ల నానో ప్లాస్టిక్ కణాలు విడదలవుతాయి. వేడి వేడి పాలు, నీళ్లల్లో ముంచినప్పడు ప్రమాదకరమైన రసాయనాలు వాటిలో చేరుతాయి. వాటిని మనం సేవిస్తే ఆరోగ్యానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ రసాయనాలు కార్సినోజెన్ల జాబితాకు చెందుతాయని వీటి వల్ల అవి క్యాన్సర్ వ్యాధులను కలగే అవకాశం ఉంటుంది. కంటికి ఈ కార్బినోజెన్లు కనిపించకపోయినప్పటికీ బ్యాగ్ ల టీలో ఉన్నట్లు పరిశోధరకులు గుర్తించారు.