Telangana Covid Latest Report : తెలంగాణలో కొత్తగా 22 కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14వేల 339 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 22 మందికి పాజిటివ్ గా..

Telangana Covid Report

Telangana Covid Latest Report : తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14వేల 339 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 22 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా హైదరాబాద్ లో 12 కేసులు వచ్చాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 24 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.

రాష్ట్రంలో ఇంకా 187 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. నేటి వరకు రాష్ట్రంలో 7లక్షల 91వేల 672 కరోనా కేసులు నమోదవగా.. 7లక్షల 87వేల 374 మంది కోలుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 13వేల 272 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 20 పాజిటివ్ కేసులు వచ్చాయి.(Telangana Covid Latest Report)

అటు దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. ముందురోజు 2 వేలకుపైగా నమోదైన కొత్త కేసులు.. తాజాగా వెయ్యికి దిగొచ్చాయి. మరణాల్లో అనూహ్య తగ్గుదల కనిపించింది.

African Swine Flu : త్రిపురలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ కలకలం..!

సోమవారం 4 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1,247 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అలాగే దేశం మొత్తం మీద కలిపి ఒకే ఒక్క కొవిడ్ మరణం నమోదైంది. అది కూడా ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ముందురోజు మృతుల సంఖ్య 214గా ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రాలు మునుపటి లెక్కలను సవరించినప్పుడే మరణాల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. ఇప్పటివరకూ కరోనాతో మరణించిన వారి సంఖ్య 5.21 లక్షలు.

తాజాగా కొత్త కేసుల కంటే రికవరీలు (928) తక్కువగా ఉన్నాయి. దాంతో యాక్టివ్ కేసుల్లో పెరుగుదల కనిపించింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 11,860 (0.03 శాతం)గా ఉంది. రికవరీ రేటు 98.76 శాతంగా కొనసాగుతోంది. నిన్న 16.89 లక్షల మంది టీకా తీసుకోగా.. ఇప్పటివరకూ 186 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంగళవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

మరోవైపు దేశ రాజధాని నగరం ఢిల్లీలో వరుసగా రెండోరోజు 500పైగా కోవిడ్ కేసులు వచ్చాయి. అయితే క్రితంరోజు కంటే కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది. పాజివిటీ రేటు 7.72 శాతానికి పెరిగింది. కేసులు పెరుగుతున్నా.. మరణాలు నమోదుకాకపోవడం ఊరటనిస్తోంది.

COVID-19: హెల్త్ వర్కర్స్‌కు కేంద్రం గుడ్‌న్యూస్

ఢిల్లీలో కరోనా వైరస్‌ ప్రాబల్యం క్రమంగా పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. గడిచిన రెండు వారాల్లో భారీగా కేసులు నమోదయ్యాయి. గత 15 రోజుల్లో ఢిల్లీ పరిసర ప్రాంత వాసుల్లో కొవిడ్‌ వ్యాప్తి 500శాతం పెరిగినట్లు ‘లోకల్‌ సర్కిల్‌’ సర్వేలో వెల్లడైంది.

కరోనా వైరస్‌ పూర్తిగా తొలగిపోయే అవకాశం లేదని.. వైరస్‌తో కలిసి జీవించడం తప్పదని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా అన్నారు. ఇదిలా ఉంటే.. కేసుల పెరుగుదల వెనుక కొత్త వేరియంట్లు ఏమైనా ఉన్నాయా? అని ధ్రువీకరించుకునేందుకు పలు శాంపిళ్లను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. కొద్ది రోజుల్లో ఈ ఫలితాలు రానున్నాయి.

కొవిడ్‌ సోకినవారిలో అధికశాతం జ్వరం, దగ్గు, గొంతు నొప్పి లాంటి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారని ఢిల్లీ డాక్టర్లు తెలిపారు. మాస్కులు ధరించకపోవడమే కేసుల పెరుగుదలకు అసలు కారణమన్నారు. చాలా మంది 3-5 రోజుల్లో కోలుకుంటున్నట్లు తెలిపారు. కాగా, ఇది కొత్త వేవ్‌ అని అనుకోవడం లేదని.. ప్రజలు మాస్కులు ధరించకపోవడం కారణంగానే కేసులు అధికమవుతున్నాయని ఢిల్లీ డాక్టర్లు అంచనా వేశారు. గత జనవరిలో వైరస్‌ విజృంభించిన సమయంలో ఎలాంటి లక్షణాలైతే ఉన్నాయో.. ప్రస్తుత బాధితుల్లోనూ అవే కనిపిస్తున్నాయని, 3 నుంచి 5 రోజుల్లో వైరస్‌ తగ్గుముఖం పడుతోందని వెల్లడించారు.