COVID-19: హెల్త్ వర్కర్స్‌కు కేంద్రం గుడ్‌న్యూస్

కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందిస్తూ ప్రాణాలు కోల్పోయే హెల్త్ వర్కర్స్ కుటుంబాల రక్షణ కోసం కేంద్రం రూపొందించిన పథకం ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్’.

COVID-19: హెల్త్ వర్కర్స్‌కు కేంద్రం గుడ్‌న్యూస్

Covid 19 (2)

COVID-19: కోవిడ్ పేషెంట్లకు చికిత్స అందిస్తూ ప్రాణాలు కోల్పోయే హెల్త్ వర్కర్స్ కుటుంబాల రక్షణ కోసం కేంద్రం రూపొందించిన పథకం ‘ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ ప్యాకేజ్’. ఇది ఇన్సూరెన్స్ స్కీం. ఈ పథకం ద్వారా కోవిడ్ చికిత్స అందిస్తూ ఎవరైనా హెల్త్ వర్కర్స్ ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలకు యాభై లక్షల రూపాయల బీమా లభిస్తుంది. మార్చి 30, 2020న ఈ స్కీం ప్రారంభమైంది.

Covid-19 Update : దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 1247 మాత్రమే..!

తాజాగా ఈ స్కీం గడువు పూర్తైంది. అయితే, కేంద్రం ఈ పథకాన్ని మరో ఆరు నెలలు (180 రోజులు) పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 19 నుంచి ఈ గడువు పొడిగింపు వర్తిస్తుంది. ఇది కోవిడ్ చికిత్సలో ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తున్న వైద్య సిబ్బందికి ఎంతో మేలు చేస్తుంది. దేశవ్యాప్తంగా మొత్తం 22.12 లక్షల మంది హెల్త్ వర్కర్స్‌కు ఈ పథకం వర్తిస్తుంది. కాగా, ఇప్పటివరకు 1905 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. ప్రస్తుతం దేశంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్రం తాజాగా గడువు పెంపు నిర్ణయం తీసుకుంది.