Telangana Corona Cases
Telangana Covid Report : తెలంగాణలో కరోనావ్యాప్తి కట్టడిలోనే ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 16వేల 128 కరోనా పరీక్షలు చేయగా 50 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 23 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 164 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 7,90,351 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,85,290 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 950 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకు 4,111 మంది కరోనాతో మరణించారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 23వేల 93 కరోనా టెస్టులు చేయగా.. 77 పాజిటివ్ కేసులు వచ్చాయి.(Telangana Covid Report)
ఏపీలోనూ కొవిడ్ మహమ్మారి ప్రభావం తగ్గింది. కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య పడిపోయింది. ప్రస్తుతం ఏపీలో 606 కోవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 11వేల 980 కరోనా పరీక్షలు నిర్వహించగా, 57 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 22 కొత్త కేసులు నమోదయ్యాయి. విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల్లో ఒక్క కేసు కూడా రాలేదు.
Corona Variant : జూన్, జులైలో కొత్త వేరియంట్ – గాంధీ సూపరింటెండెంట్ రాజారావు
అదే సమయంలో 84 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన ఒక్కరోజులో మరణాలేవీ సంభవించ లేదు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 23,18,858 మంది కరోనా బారినపడగా వారిలో 23,03,522 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 14,730 మంది మృత్యువాతపడ్డారు.
దేశంలో కరోనా మహమ్మారి పూర్తిగా అదుపులోకి వస్తోంది. కొన్ని రోజులుగా నమోదవుతున్న కొత్త కేసులు, మరణాల్లో గణనీయ తగ్గుదల కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్త కేసులు 3 వేలకు దిగిరాగా.. మరణాలు భారీ సంఖ్యలో తగ్గడం ఊరట కలిగిస్తోంది.
నిన్న 7,61,737 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 3,116 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇక మరణాల సంఖ్యలో భారీ తగ్గుదల కనిపించింది. అంతకుముందు రోజు 89 మరణాలు నమోదుకాగా.. ఆ సంఖ్య మరింత తగ్గి నిన్న 47కు చేరింది. దీంతో దేశంలో ఇప్పటివరకూ కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 5,15,850కి చేరింది.
Telangana Covid Numbers : తెలంగాణలో కొత్తగా 77 కరోనా కేసులు
కొన్ని రోజులుగా రోజువారీ కేసుల కంటే కోలుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉండటం సానుకూలాంశం. నిన్న 5,559 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకూ వైరస్‌ను జయించిన వారి సంఖ్య 4.24 కోట్లు దాటింది. ఆ రేటు 98.71 శాతానికి మెరుగైంది. ఇక యాక్టివ్ కేసుల సంఖ్యా గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుతం దేశంలో 38,069 (0.09%) యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.
ఇక దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. నిన్న 20,31,275 మంది టీకాలు వేయించుకోగా.. ఇప్పటి వరకూ పంపిణీ చేసిన డోసుల సంఖ్య 180 కోట్లు దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.13.03.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/5YHd1tfSh6— IPRDepartment (@IPRTelangana) March 13, 2022