Telangana Covid Numbers : తెలంగాణలో కొత్తగా 77 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 23వేల 936 కరోనా టెస్టులు చేయగా..(Telangana Covid Numbers)

Telangana Covid Numbers : తెలంగాణలో కొత్తగా 77 కరోనా కేసులు

Telangana Corona Cases

Telangana Covid Numbers : తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 23వేల 936 కరోనా టెస్టులు చేయగా కొత్తగా 77 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు. గత 24 గంటల్లో మరో 154 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.(Telangana Covid Numbers)

రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,90,301. రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 7,85,126. రాష్ట్రంలో ఇప్పటివరకు కోవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111గా ఉంది. రాష్ట్రంలో ఇంకా 1064 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితంరోజు 90 కరోనా కేసులు వచ్చాయి.

ఏపీలోనూ కోవిడ్ వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. అయితే.. గడిచిన 24 గంటల వ్యవధిలో కరోనాతో ఒకరు మరణించారు. గత కొన్నిరోజుల తర్వాత రాష్ట్రంలో కరోనాతో మృతి చెందడం ఇదే ప్రథమం. తాజా మరణంతో ఇప్పటివరకు ఈ వైరస్ మహమ్మారి బారినపడి కన్నుమూసిన వారి సంఖ్య 14,730కి పెరిగింది.(Telangana Covid Numbers)

TS Covid Update : తెలంగాణలో ఇవాళ కొత్తగా 90 కోవిడ్ కేసులు నమోదు

ఇక, రోజువారీ కేసుల విషయానికొస్తే, గడచిన ఒక్కరోజులో 12,789 కరోనా పరీక్షలు నిర్వహించగా, 50 మందికి పాజిటివ్ గా వెల్లడైంది. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 12 కొత్త కేసులు నమోదయ్యాయి. కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొత్త కేసులేవీ నమోదు కాలేదు.(Telangana Covid Numbers)

అదే సమయంలో 77 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇంకా 633 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 23,18,801 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 23,03,438 మంది కోలుకున్నారు.

అటు దేశంలోనూ కరోనా వ్యాప్తి కట్టడిలోనే ఉంది. రెండేళ్లుగా పలు వేరియంట్ల రూపంలో విజృంభించిన కరోనా వైరస్.. ప్రస్తుతం అదుపులోనే ఉంది. మహమ్మారి తీవ్రత ప్రారంభ రోజుల నాటి స్థాయికి పడిపోతోంది. దాంతో కొద్దిరోజులుగా కొత్త కేసులు 3 వేల నుంచి 5 వేల మధ్యలో నమోదవుతున్నాయి. అయితే మరణాల సంఖ్యలో మాత్రం హెచ్చుతగ్గులు ఉంటున్నాయి.(Telangana Covid Numbers)

గడిచిన 24 గంటల్లో 8 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 3వేల 614 మందికి పాజిటివ్‌గా తేలింది. 24 గంటల వ్యవధిలో మరో 89 మంది కోవిడ్ తో చనిపోయారు. క్రితం రోజు 255 మంది కోవిడ్ తో మరణించగా, తాజాగా ఆ సంఖ్య 100 దిగువకు చేరింది. ఇప్పటివరకూ 4.29 కోట్ల మందికి కరోనా సోకగా.. 5.15 లక్షల మంది మరణించారు. 4.24 కోట్ల మంది కోలుకున్నారు.

Pfizer BioNTech : ఫైజర్ బయోఎంటెక్ వ్యాక్సిన్.. పిల్లల్లో ఒమిక్రాన్ ఇన్ఫెక్షన్లను అద్భుతంగా తగ్గిస్తోంది.. కొత్త అధ్యయనం!

నిన్న ఒక్కరోజే 5వేల మందికి పైగా కొవిడ్ నుంచి బయటపడ్డారు. కరోనా వ్యాప్తి అదుపులో ఉండటంతో.. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 40,559కు చేరింది. మొత్తం కేసుల్లో ఆ వాటా 0.9 శాతం మాత్రమే. రికవరీ రేటు 98.71 శాతానికి చేరి ఊరటనిస్తోంది. ఇక నిన్న 18.18 లక్షల మంది టీకా తీసుకోగా.. 179 కోట్లకు పైగా డోసులు పంపిణీ అయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ శనివారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.