Telangana Corona Cases : తెలంగాణలో కరోనా కల్లోలం.. కొత్తగా ఎన్ని కేసులు అంటే

తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.

Telangana Corona Cases : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 28వేల 306 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 581 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 227 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 45, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 40 కేసులు, పెద్దపల్లి జిల్లాలో 30 కేసులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 26, మంచిర్యాల జిల్లాలో 24, నల్గొండ జిల్లాలో 22, ఖమ్మం జిల్లాలో 20 కేసులు గుర్తించారు.

Monkeypox: “కొవిడ్ మాదిరిగానే జాగ్రత్తలు పాటించండి”

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 645 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్త కేసుల కన్నా రికవరీల సంఖ్య ఎక్కువగా ఉండటం రిలీఫ్ ఇచ్చే అంశం. ఊరటనిచ్చే మరో అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 14వేల 884 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 06వేల 207 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 566గా ఉంది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సోమవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 24వేల 927 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 531 మందికి పాజిటివ్ గా తేలింది.

Covid Vaccine: ఒక్క డోసు కూడా తీసుకోని 4 కోట్ల మంది.. కేంద్రం ప్రకటన

కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ట్రెండింగ్ వార్తలు