Monkeypox: “కొవిడ్ మాదిరిగానే జాగ్రత్తలు పాటించండి”

: ప్రపంచదేశాలను కలవరపెట్టిస్తున్న మరో పెనుభూతం మంకీపాక్స్.. ఇప్పటికే ఇండియాలో నాలుగు కేసులు నమోదైనట్లు అధికారులు కన్ఫామ్ చేశారు. దేశ రాజధానిలో 34ఏళ్ల వ్యక్తికి విదేశఆలకు వెళ్లినట్లు ఎటువంటి రికార్డు లేకపోయినా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది.

Monkeypox: “కొవిడ్ మాదిరిగానే జాగ్రత్తలు పాటించండి”

Face Mask

 

 

Monkeypox: ప్రపంచదేశాలను కలవరపెట్టిస్తున్న మరో పెనుభూతం మంకీపాక్స్.. ఇప్పటికే ఇండియాలో నాలుగు కేసులు నమోదైనట్లు అధికారులు కన్ఫామ్ చేశారు. దేశ రాజధానిలో 34ఏళ్ల వ్యక్తికి విదేశఆలకు వెళ్లినట్లు ఎటువంటి రికార్డు లేకపోయినా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం జాగ్రత్త చర్యలు ముమ్మరం చేసింది.

ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ హాస్పిటల్ లో రెండ్రోజుల క్రితమే ఆ పేషెంట్ జాయిన్ అయ్యాడని స్కాన్ ఇన్ఫెక్షన్ తో జాయిన్ అవ్వగా ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డా. సురేశ్ కుమార్ అన్నారు.

“ఎల్ఎన్జేపీలోని ఐసోలేషన్ వార్డులో ఆరు బెడ్ లు ఉంచాం. అత్యవసరమైతే బెడ్‌లు పెంచుతాం కూడా. హాస్పిటల్ స్టాఫ్ మంకీపాక్స్‌ను హ్యాండిల్ చేయడంలో వారం క్రితమే ట్రైనింగ్ కూడా తీసుకున్నారు. కేరళలో తొలికేసు నమోదైన వెంటనే అప్రమత్తమయ్యాం. స్టాఫ్ మొత్తానికి మాస్కులతో పాటు, పీపీఈ కిట్లు కూడా ఇచ్చాం” అని సురేశ్ కుమార్ తెలిపారు.

Read Also : మంకీ పాక్స్‌పై కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నత స్ధాయి సమావేశం

“మంకీపాక్స్ ట్రీట్ చేయడంలో ప్రొటోకాల్ తప్పక పాటించాలి. కొవిడ్ కు పాటించినట్లుగానే మాస్కులు, సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలి. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి” అని కుమార్ పేర్కొన్నారు.

అంతేకాకుండా ట్రావెల్ హిస్టరీ లేని వాళ్లలో కూడా కేసులు నమోదవుతుండటం ఆందోళన కలిగించే విషయమని పేర్కొన్నారు.

ప్రజలు భయానికి గురి కావొద్దని.. ఢిల్లీ వాసుల్లో వ్యాప్తి జరగకుండా మా బెస్ట్ టీం పనిచేస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ ద్వారా వెల్లడించారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సైతం శనివారం మంకీపాక్స్ వైరస్ ను ప్రస్తావిస్తూ.. గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జైన్సీ ప్రకటించింది. మంకీపాక్స్ వైరస్ సాధారణంగా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగానైనా జంతువుల నుంచి మనుషులకు ఉన్నకాంటాక్ట్ ద్వారా వ్యాపిస్తున్నట్లు తెలిసింది. మనుషుల నుంచి మనుషులకు సోకడంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఫేస్ టూ ఫేస్, స్కిన్ టూ స్కిన్, నోటి, శ్వాస తుంపరల ద్వారా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది.