Covid Vaccine: ఒక్క డోసు కూడా తీసుకోని 4 కోట్ల మంది.. కేంద్రం ప్రకటన

ఒక పక్క దేశంలో బూస్టర్ డోసులు తీసుకునేందుకు ప్రజలు సిద్ధమవుతుంటే.. ఇంకొందరు ఇప్పటివరకు ఒక్క వ్యాక్సిన్ కూడా తీసుకోలేదట. అర్హత కలిగిన దాదాపు 4 కోట్ల మంది ఒక్క డోసు కూడా తీసుకోలేదని కేంద్రం తెలిపింది.

Covid Vaccine: ఒక్క డోసు కూడా తీసుకోని 4 కోట్ల మంది.. కేంద్రం ప్రకటన

Covid Vaccine

Covid Vaccine: ఇప్పటికే కోట్ల మంది కోవిడ్ వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకునేందుకు సిద్ధమవుతుంటే ఇంకొందరు ఒక్క డోసు కూడా తీసుకోలేదట. ఈ నెల 18 వరకు ఉన్న గణాంకాల ప్రకారం దేశంలో ఇప్పటివరకు 4 కోట్ల మంది ఒక్క డోసు కూడా తీసుకోలేదని కేంద్రం తాజాగా వెల్లడించింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజాగా లోక్‌సభలో ఈ వివరాల్ని వెల్లడించింది. మరోవైపు కేంద్రం దేశవ్యాప్తంగా బూస్టర్ డోసుల్ని కూడా ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే.

Monkeypox: పెరుగుతున్న మంకీపాక్స్ కేసులు.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన డబ్ల్యూహెచ్ఓ

స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా 75 రోజులపాటు ఉచితంగా బూస్టర్ డోసులు కూడా పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. మరోవైపు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ 200 కోట్లు దాటిన సంగతి తెలిసిందే. కేంద్రం వెల్లడించిన తాజా గణాంకాల ప్రకారం దేశంలో 18 ఏళ్లు దాటిన వారిలో దాదాపు 98 శాతం కనీసం ఒక్క డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. 90 శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నారు. కేంద్రం ఉచితంగా బూస్టర్ డోసు అందిస్తుండటంతో బూస్టర్ డోసు తీసుకునే వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది.