×
Ad

Telangana Covid Cases : తెలంగాణలో కరోనా టెర్రర్.. రికార్డు స్థాయిలో పెరిగిన కేసులు

తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవడం టెన్షన్ పెట్టిస్తోంది.

  • Published On : July 29, 2022 / 08:46 PM IST

Telangana Covid

Telangana Covid Cases : తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవడం టెన్షన్ పెట్టిస్తోంది.

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 40వేల 593 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 923 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 366 కొత్త కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 79 కేసులు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 59 కేసులు, నల్గొండ జిల్లాలో 51 కేసులు, పెద్దపల్లి జిల్లాలో 34 కేసులు, నిజామాబాద్ జిల్లాలో 28 కేసులు గుర్తించారు.

Wuhan Lockdown : చైనాలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్.. కరోనా పుట్టినిల్లు వుహాన్‌లో 10లక్షల మంది లాక్‌డౌన్

అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 739 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే మరో అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 18వేల 290 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 09వేల 009 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 5వేల 170కి పెరిగింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 24 గంటల్లో 38వేల 122 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 836 మందికి పాజిటివ్ గా తేలింది.

Monkeypox: మంకీపాక్సా.. స్కిన్ అలర్జీనా? తేడా తెలుసుకోండి

కరోనా కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ప్రజలకు జాగ్రత్తలు చెప్పింది. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించాలంది. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది. చేతులను తరుచుగా శుభ్రంగా కడుక్కోవాలంది. అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. పెద్దలు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.