Monkeypox: మంకీపాక్సా.. స్కిన్ అలర్జీనా? తేడా తెలుసుకోండి

చర్మ వ్యాధులు వస్తే చాలు.. మంకీపాక్స్ సోకిందేమో అనే అనుమానంతో ఆస్పత్రులకు వస్తున్న పేషెంట్ల సంఖ్య ఇటీవల పెరిగిపోయింది. దీంతో వైద్యులు అనవసర ఆందోళన వద్దని సూచిస్తున్నారు. మంకీపాక్స్‌పై సరైన అవగాహన కలిగి ఉంటే చాలంటున్నారు.

Monkeypox: మంకీపాక్సా.. స్కిన్ అలర్జీనా? తేడా తెలుసుకోండి

Monkeypox

Monkeypox: మంకీపాక్స్ కేసులు దేశంలో నమోదవుతుండటంతో చాలా మందిలో భయం పెరిగిపోతోంది. తమకు కూడా మంకీపాక్స్ వచ్చిందేమో అని అనుమానిస్తూ చాలా మంది వైద్యులను సంప్రదిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో విదేశాల నుంచి వచ్చిన వాళ్లలో ఈ భయాలు ఎక్కువగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

Mass Hysteria: అరుపులు.. ఏడుపులు.. స్కూల్లో విచిత్రంగా ప్రవర్తించిన అమ్మాయిలు… అసలేమైంది?

అయితే మంకీపాక్స్‌కు, సాధారణ చర్మ వ్యాధులకు మధ్య తేడా తెలుసుకుంటే ఈ భయం అక్కర్లేదని భరోసా ఇస్తున్నారు. ఈ విషయం గురించి అవగాహన పెంచుకుంటే ఒకవేళ కేసులు పెరిగినప్పటికీ అనవసరంగా ఆందోళన చెందకుండా ఉండొచ్చు. అందుకే మంకీపాక్స్ గురించి అవగాహన కలిగి ఉండాలి. మంకీపాక్స్‌ కూడా చర్మవ్యాధే అయినప్పటికీ, ఇతర అనేక లక్షణాలు కూడా ఉంటాయి. మంకీపాక్స్‌ సోకితే జ్వరం, తలనొప్పి, గొంతునొప్పి, దగ్గు, అలసట, మెడ దగ్గర గ్రంథుల వాపు వంటి లక్షణాలు ముందుగా వస్తాయి. ఆ తర్వాత చర్మ సమస్యలు మొదలవుతాయి. ముందుగా చేతుల దగ్గర దద్దుర్లు వంటివి మొదలవుతాయి. ఆ తర్వాత కళ్లు, ఇతర భాగాలకు వ్యాప్తి చెందుతాయి.

Theaters : ఒక టికెట్ కొంటే ఇంకో టికెట్ ఫ్రీ.. అయినా థియేటర్ కి రాని జనం..

ఇలా ముందుగా జ్వరం వంటి లక్షణాలు కనిపించిన తర్వాత చర్మ సమస్యలు వస్తే అప్పుడు మంకీపాక్స్ అయ్యుండే అవకాశం ఉంది. అయితే, మంకీపాక్స్‌లో ఇతర లక్షణాలు కూడా ఉంటాయి. చాలా మంది తమ చర్మంపై దద్దుర్లు వంటివి కనిపిస్తే చాలు.. మంకీపాక్స్ సోకిందేమో అనుమానంతో ఆస్పత్రులకు వస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. ఇంకా ఇంటర్నెట్‌లో సమాచారాన్ని శోధించి, లేనిపోని భయాలు కూడా పెంచుకుంటున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.