Mass Hysteria: అరుపులు.. ఏడుపులు.. స్కూల్లో విచిత్రంగా ప్రవర్తించిన అమ్మాయిలు… అసలేమైంది?

స్కూళ్లో బాలికలు ఉన్నట్లుండి ఏడ్వడం, గట్టిగా అరవడం, నేలపై దొర్లడం, తల బాదుకోవడం చేశారు. దీంతో అక్కడున్న టీచర్లకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పిల్లల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఉత్తరాఖండ్‌లోని ఒక గ్రామంలో ఈ ఘటన జరిగింది.

Mass Hysteria: అరుపులు.. ఏడుపులు.. స్కూల్లో విచిత్రంగా ప్రవర్తించిన అమ్మాయిలు… అసలేమైంది?

Mass Hysteria: ఉత్తరాఖండ్‌లో అంతుచిక్కని సంఘటన జరిగింది. ఒక ప్రభుత్వ పాఠశాలకు చెందిన కొందరు విద్యార్థినులు ఉన్నట్లుండి వింతగా ప్రవర్తించారు. స్కూళ్లో కొందరు బాలికలు గట్టిగా ఏడ్వడం, వింతగా అరవడం, నేలపై పడి దొర్లడం, గోడకు తల బాదుకోవడం వంటివి చేశారు. దీంతో అక్కడున్న ఉపాధ్యాయులకు, తోటి పిల్లలకు ఏం జరుగుతోందో అర్థం కాలేదు.

Bandla Ganesh : హీరోలని రెమ్యునరేషన్ తగ్గించుకోమని అడిగే అర్హత మనకి లేదు..

ఈ ఘటన గత మంగళ, గురువారాల్లో బగేశ్వర్ పరిధిలోని రైఖులి అనే గ్రామంలో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్ని ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్ విమలా దేవి వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మంగళ, గురు వారాల్లో పిల్లలు స్కూళ్లో విచిత్రంగా ప్రవర్తించారు. గట్టిగా ఏడుస్తూ, అరుస్తూ, నేలపై దొర్లుతూ, తల బాదుకుంటూ, వణికిపోతూ కనిపించారు. టీచర్లు పిల్లల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. దీంతో పిల్లల తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తర్వాత కాసేపటికి పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటనపై ప్రిన్సిపల్ జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

Manisha Ropeta: పాకిస్తాన్‌లో తొలి హిందూ మహిళా డీఎస్పీగా మనీషా

కొందరు వైద్యులు, మానసిక నిపుణులు పాఠశాలను సందర్శించారు. ఈ సమయంలో కూడా పిల్లలు ఇలాగే ప్రవర్తించారు. తర్వాత పిల్లలకు రకరకాల పరీక్షలు, కౌన్సెలింగ్ నిర్వహించారు. సాధారణంగా ఇలా ఒకేసారి ఎక్కువమంది వింతగా, విచిత్రంగా ప్రవర్తించడాన్ని ‘మాస్ హిస్టీరియా’ అంటారు. అయితే, పిల్లల్ని అనేక రకాలుగా పరీక్షించిన వైద్యులు ఇటీవలి వరదల్లో తమ స్నేహితురాలు చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయినట్లు చెప్పారు. అది కూడా ఈ ప్రవర్తనకు ఒక కారణం అయ్యుండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, కొంతమందికి కంటి సమస్యలున్నాయని వైద్యులు తెలిపారు.

Surname Of Child: పిల్లల ఇంటిపేర్లు తల్లుల ఇష్టం: సుప్రీం కోర్టు

ఇలాంటి ఘటనలే ఇటీవలి కాలంలో అక్కడి మరికొన్ని ప్రభుత్వ స్కూళ్లలో కూడా జరిగినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ అంశంపై నిపుణుల పరిశీలన కొనసాగుతోంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.