Wuhan Lockdown : చైనాలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్.. కరోనా పుట్టినిల్లు వుహాన్‌లో 10లక్షల మంది లాక్‌డౌన్

చైనాలో మరోసారి కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. ప్రపంచంలోనే తొలి కరోనావైరస్ కేసు వెలుగుచూసిన వుహాన్ లో.. తాజాగా 4 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. జీరో కొవిడ్ నిబంధనలు అమలు చేసింది. దాదాపు 10 లక్షల మందిని లాక్ డౌన్ లో ఉంచారు.

Wuhan Lockdown : చైనాలో మళ్లీ కరోనా డేంజర్ బెల్స్.. కరోనా పుట్టినిల్లు వుహాన్‌లో 10లక్షల మంది లాక్‌డౌన్

Wuhan Lockdown

Wuhan Lockdown : చైనాలో మరోసారి కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనావైరస్ మహమ్మారి పుట్టినిల్లుగా చెప్పుకునే చైనా సెంట్రల్ సిటీ వుహాన్ లో.. తాజాగా 4 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదవడంతో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. జీరో కొవిడ్ నిబంధనలు అమలు చేసింది. దాదాపు 10 లక్షల మందిని లాక్ డౌన్ లో ఉంచారు.

జియాంగ్జియా జిల్లాలో ఉన్న ప్రజలను ఇళ్లలోనే ఉండాలని అధికారులు కోరారు. దీంతో రవాణ వ్యవస్థ స్తంభించింది. చైనా అమలు చేస్తున్న కొవిడ్ ఆంక్షల విధానాలతో ప్రజల్లో తీవ్ర అసహనం పెరుగుతోంది. వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కరోనా కట్టడికి చైనా స‌ర్కార్ కఠినమైన జీరో కోవిడ్ పాలసీని అనుస‌రిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో భాగంగా సామూహిక ప‌రీక్ష‌లు, క‌ఠినంగా ఐసోలేష‌న్ అమ‌లు చేయ‌డం, లాక్‌డౌన్ విధింపు చేస్తున్నారు. కాగా, చైనా అమ‌లు చేస్తున్న కొవిడ్ ఆంక్ష‌ల విధానాల‌ను ఆ దేశ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కొవిడ్ జీరో పాలసీ కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. జీరో కొవిడ్ పాలసీ కారణంగా మరణాలు కూడా సంభవించాయి. 12 మిలియన్స్ జనాభా ఉన్న వుహాన్ లో రెగులర్ గా కరోనా టెస్టులు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం ఈ టెస్టుల్లో రెండు లక్షణరహిత కరోనా కేసులు బయటపడ్డాయి. కాంటాక్ట్ ట్రేసింగ్ ద్వారా మరో రెండు కేసులు కనుగొనబడ్డాయి.

వుహాన్ కరోనా పుట్టినిల్లుగా గుర్తింపు పొందింది. ప్రపంచంలో మొదటిసారిగా కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది వుహాన్ లోనే. అంతేకాదు కఠినమైన నిర్బంధ చర్యలు ఉంచబడిన మొదటి నగరం కూడా వుహానే.

కరోనా పుట్టినిల్లు వుహాన్‌కు WHO సైంటిస్టులు.. అసలు వైరస్ మూలం ఎక్కడో తేల్చేస్తాం!

కరోనా వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి దాని మూలలపై తీవ్ర చర్చ జరిగింది. చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే వైరస్‌ బయటకు వచ్చిందనే ప్రచారమూ జరిగింది. చైనా మాత్రం దీన్ని ఖండించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా కోవిడ్-19 ఎక్కడ పుట్టిందనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

అయితే తాజాగా కరోనా మూలాలపై అధ్యయనం చేసిన రెండు నివేదికలు వైరస్ వ్యాప్తి వుహాన్‌లోనే మొదలైందని స్పష్టం చేశాయి. అయితే ఇది కచ్చితంగా వుహాన్ ల్యాబ్‌లో పుట్టలేదని, అదే నగరంలోని సీఫుడ్ మార్కెట్‌ నుంచే దీని వ్యాప్తి మొదలైందని పేర్కొన్నాయి. అడవి జంతువులు, క్షీరదాల విక్రయాలు జరిగే సమయంలో వైరస్ ఉత్పరివర్తనం చెంది మనుషులకు వ్యాపించి ఉంటుందని స్పష్టం చేశాయి. రెండు నివేదికలు అడవిలోని క్షీరదాల్లోనూ సార్స్‌ కోవ్-2 వైరస్ ఉన్నట్లు వెల్లడించాయి.

Ban On Lockdown : లాక్‌డౌన్ పదంపై నిషేధం విధించిన దేశం

2019 నవంబర్‌ ముందు వరకు సార్స్‌ కోవ్-2 మనుషులకు వ్యాపించలేదని అధ్యయనం స్పష్టం చేసింది. 2019 డిసెంబర్‌ 20 నాటికి వెలుగు చూసిన తొలి 8 కరోనా కేసులు వుహాన్ సీ ఫుడ్ మార్కెట్ ఉన్న పశ్చిమ ప్రాంతంలోనే నమోదయ్యాయని అధ్యయానాలు పేర్కొన్నాయి.

చైనాలో వెలుగుచూసిన కరోనా ఆ తర్వాత ప్రపంచ దేశాలకు విస్తరించి అతలాకుతలం చేసింది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచవ్యాప్తంగా 60లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పాయారు. అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలి విపత్కర పరిస్థితిని ఎదుర్కొన్నాయి.