Ban On Lockdown : లాక్‌డౌన్ పదంపై నిషేధం విధించిన దేశం

2 నెలల తర్వాత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. షాంఘై వీధుల్లో ఆనందంగా తిరుగుతూ సెల్ఫీలు దిగుతున్నారు.

Ban On Lockdown : లాక్‌డౌన్ పదంపై నిషేధం విధించిన దేశం

Ban On Lockdown

Ban On Lockdown : చైనా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్ అనే పదంపై నిషేధం విధించింది. ఈ సందర్భంగా స్థానిక మీడియాకు ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇక నుంచి లాక్ డౌన్ అనే పదాన్ని వాడొద్దని మీడియాకు తేల్చి చెప్పింది.

కొన్ని నెలలుగా కొవిడ్ ఆంక్షల్లో ఉన్న షాంఘై నగరంలో ప్రభుత్వం ఆంక్షలను సడలించింది. జీరో కొవిడ్ పాలసీని కఠినంగా అమలు చేయడంతో షాంఘైలో కేసులు అదుపులోకి వచ్చాయి. 2 నెలల తర్వాత ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. షాంఘై వీధుల్లో ఆనందంగా తిరుగుతూ సెల్ఫీలు దిగుతున్నారు.(Ban On Lockdown)

షాంఘైలో లాక్ డౌన్ ముగిసిందని పేర్కొంటూ మీడియా కథనాలు ప్రసాదం చేసింది. దీనిపై చైనా ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇక నుంచి లాక్ డౌన్ అనే పదం వాడొద్దు అంటూ మీడియాకు ఆదేశాలు జారీ చేసింది.

షాంఘైలో లాక్ డౌన్ ముగిసిందని పేర్కొంటూ మీడియా కథనాలు ప్రసాదం చేసింది. దీనిపై చైనా ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇక నుంచి లాక్ డౌన్ అనే పదం వాడొద్దు అంటూ మీడియాకు ఆదేశాలు జారీ చేసింది.

Monkeypox Cases: 23దేశాల్లో 250మంకీపాక్స్ కేసులు నమోదు

రెండు నెలల లాక్‌డౌన్ ముగింపు గురించి నివేదించేటప్పుడు “లాక్‌డౌన్” అనే పదాన్ని ఉపయోగించడం మానుకోవాలని అధికారులు మీడియాకు తేల్చి చెప్పారు. రెండు నెలల కఠిన లాక్ డౌన్ అనంతరం.. ప్రజలు తమ ఇంటి నుంచి బయటకు రావడానికి, ప్రజా రవాణ ఉపయోగించడానికి, ఆఫీసు నుండి పని చేయడానికి ప్రభుత్వం అనుమతించింది. అయితే, “లాక్‌డౌన్‌ను ముగించడం” అనే పదబంధాన్ని ఉపయోగించవద్దని దేశంలోని మీడియా సంస్థలకు హుకుం జారీ చేసింది.

“లాక్‌డౌన్‌ను ముగించడం” అనే పదబంధాన్ని ఉపయోగించవద్దు. వుహాన్ మాదిరిగా కాకుండా, షాంఘై ఎప్పుడూ లాక్‌డౌన్ ప్రకటించలేదు. కాబట్టి “లాక్‌డౌన్‌ను ముగించడం” లేదు. షాంఘైలోని అన్ని ప్రాంతాలు స్టాటిక్ మేనేజ్‌మెంట్-స్టైల్ అణచివేత మరియు సస్పెన్షన్లకు లోనయ్యాయి. అయితే నగరం యొక్క ప్రధాన విధులు ఈ కాలంలో పని చేస్తూనే ఉన్నాయి. సంబంధిత చర్యలు తాత్కాలికమైనవి, షరతులతో కూడినవి మరియు పరిమితమైనవి అని నొక్కి చెప్పండి. జూన్ 1న పునఃప్రారంభం కూడా షరతులతో కూడుకున్నది. ఇది మొత్తం నగరం అంతటా ప్రతి జిల్లాలో ఉన్న ప్రతి వ్యక్తి ఒకేసారి స్వేచ్ఛగా బయటికి వెళ్లడం లేదా ఇది ఏకరీతి సడలింపు కాదు” అని అధికారులు అన్నారు.

Monkey Pox: ప్రపంచాన్ని కలవరపెడుతున్న ‘మంకీపాక్స్’.. మరో ‘కరోనా’ అవుతుందా?

రెండు నెలల లాక్‌డౌన్ తర్వాత సాధారణ స్థితికి వచ్చే దిశగా షాంఘైలో కోవిడ్-19 పరిమితుల శ్రేణిని ప్రభుత్వం సడలించింది. ఈ మెగాసిటీ ప్రజలను వారి ఇళ్లకు పరిమితం చేయడం చైనా ఆర్థిక వ్యవస్థను బాగానే దెబ్బతీసింది. కరోనా తీవ్రత పెరడంతో… 25 మిలియన్ల మంది జనాభా కలిగిన.. చైనా వాణిజ్య కేంద్రం షాంఘైలో మార్చి చివరి నుండి విభాగాల వారిగా మూసివేయబడింది.

Monkeypox : ప్రపంచాన్ని కలవరపెడుతున్న మంకీపాక్స్‌ను గుర్తించేందుకు ఆర్‌టీ-పీసీఆర్‌ కిట్‌