Telangana Covid Report
Telangana Covid Cases Update : తెలంగాణలో కరోనా రోజువారీ కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. గడిచిన 24 గంటల్లో 12వేల 829 కరోనా పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 44 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 31 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 34 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు.
తెలంగాణలో ఇప్పటివరకు 7,92,191 పాజిటివ్ కేసులు నమోదు కాగా… 7,87,716 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్యలోనూ స్వల్ప పెరుగుదల నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా ఇంకా 364 మంది చికిత్స పొందుతున్నారు. నేటివరకు రాష్ట్రంలో కొవిడ్ తో మరణించిన వారి సంఖ్య 4వేల 111గా ఉంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 12వేల 449 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 39మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.(Telangana Covid Cases Update)
COVID-19 Vaccine: 12ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ అందుబాటులో Covovax
కాగా, దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. క్రితం రోజుతో పోలిస్తే కేసులు స్వల్పంగా పెరిగాయి. బుధవారం దేశవ్యాప్తంగా 4.23 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 3వేల 275 మందికి పాజిటివ్ గా తేలింది. ఢిల్లీలో 1,354 మందికి వైరస్ సోకగా… పాజిటివిటీ రేటు 7.64 శాతానికి పెరిగింది. ముంబైలో 117 కేసులు రాగా, ఫిబ్రవరి 24 తర్వాత ఇవే అత్యధికం కావడం గమనార్హం.
Telangana Reports New 44 Covid Cases
ఇక ఒక్కరోజు వ్యవధిలో మరో 3,010 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.74 శాతంగా కొనసాగుతోంది. యాక్టివ్ కేసులు 19,719(0.05శాతం)కి పెరిగాయి. 24 గంటల వ్యవధిలో మరో 55 మంది కరోనాతో చనిపోయారు. ఈ రెండేళ్ల కాలంలో 4.30 కోట్లకు పైగా కరోనా కేసులు రాగా.. 5.23 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి.
Covid in China : అట్లుంటది చైనాలో..ఎంత బలవంతంగా కోవిడ్ పరీక్షలు చేస్తున్నారో..!!
తాజాగా పంజాబ్‌లోని పటియాలాకు చెందిన రాజీవ్ గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా(ఆర్‌జీఎన్‌యూఎల్)లో కరోనా కలకలం సృష్టించింది. అక్కడ 60 మంది విద్యార్థులకు పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు ఆ యూనివర్సిటీని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. బాధితుల్లో స్వల్ప లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. వారిని ప్రత్యేక గదుల్లో ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపారు. మరోపక్క ఐఐటీ మద్రాస్‌లో ఇటీవల పదుల సంఖ్యలో విద్యార్థులకు కరోనా సోకింది. ప్రస్తుతం అక్కడ వైరస్ సోకిన వారి సంఖ్య 170కి చేరింది.
Omicron Sub variants: వైరస్ ఎలా మార్పు చెందుతుందో తెలుసుకోలేక పోతున్నాం.. డబ్ల్యూహెఓ ఆందోళన
వైరస్ కట్టడికి ప్రారంభించిన టీకా కార్యక్రమంలో 189 కోట్లకుపైగా డోసులు పంపిణీ అయ్యాయి. నిన్న 13.98 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం కరోనా బులెటిన్ విడుదల చేసింది.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.05.05.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealthy pic.twitter.com/lNSlJR5co8— IPRDepartment (@IPRTelangana) May 5, 2022