Omicron Sub variants: వైరస్ ఎలా మార్పు చెందుతుందో తెలుసుకోలేక పోతున్నాం.. డబ్ల్యూహెఓ ఆందోళన

ప్రపంచంలోని చాలా దేశాల్లో వైరస్ ఎలా మార్పులు చెందుతుందో తెలుసుకోలేక పోతున్నాం. తర్వాత ఏం జరుగుతుందో తెలియదంటూ కరోనా వేరియంట్ ఓమిక్రాన్ లో చోటు చేసుకుంటున్న ఉత్పరివర్తనాలపై..

Omicron Sub variants: వైరస్ ఎలా మార్పు చెందుతుందో తెలుసుకోలేక పోతున్నాం.. డబ్ల్యూహెఓ ఆందోళన

Omicron Variant

Omicron Sub variants: ప్రపంచంలోని చాలా దేశాల్లో వైరస్ ఎలా మార్పులు చెందుతుందో తెలుసుకోలేక పోతున్నాం. తర్వాత ఏం జరుగుతుందో తెలియదంటూ కరోనా వేరియంట్ ఓమిక్రాన్ లో చోటు చేసుకుంటున్న ఉత్పరివర్తనాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధిపతి టెడ్రోస్ అధనామ్ ఆందోళన వ్యక్తం చేశారు. 2021 నవంబర్ లో దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్ వేరియంట్ ను గుర్తించారు. నాటి నుంచి వేగంగా ప్రపంచ దేశాలకు వ్యాపించింది. ప్రస్తుతం వెలుగు చూస్తోన్న కొత్త కేసుల్లో ఈ వేరియంటే అత్యధికంగా కనిపిస్తోంది.

World Health Day 2022 : మనం పీల్చే గాలి మంచిదేనా? ప్రపంచ జనాభా 99శాతం కలుషితమైన గాలినే పీలుస్తోంది.. WHO కొత్త డేటా!

అయితే ఈ వేరియంట్ ఉపరకాలు ఉత్పరివర్తన చెందుతుండటంతో వాటి లక్షణాల్లో మార్పు కనిపిస్తోందని డబ్ల్యూహెచ్ఓ నివేదికలో పేర్కొంది. ఉపరకాలు ఉత్పరివర్తనాలను దక్షణాఫ్రికాలో గుర్తించారు. ప్రపంచ దేశాల్లో అధిక దేశాలు వేరియంట్ల జన్యుక్రమాన్ని విశ్లేషించడాన్ని ఆపేశాయి. అయితే దక్షిణాఫ్రికా ఇంకా దానిని కొనసాగిస్తోంది. దీంతో బీఏ4, బీఏ5 సబ్ వేరియట్లను డబ్ల్యూహెచ్ఓ ఆదేశంలో గుర్తించింది. బీఏ4, బీఏ5 సబ్ వేరియంట్లు దక్షిణాఫ్రికాలో కొత్త ఉప్పెనకు దారితీస్తున్నాయని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. అయితే వీటినుంచి ప్రజలు రక్షణ పొందడానికి వ్యాక్సినేషన్ తో పాటు కొవిడ్ నిబంధనలు పాటించమేనని డబ్ల్యూహెచ్ఓ అధిపతి టెడ్రోస్ అధనామ్ తెలిపారు.