×
Ad

Telangana Rising Global Summit: 44 దేశాలు.. 154 మంది డెలిగేట్స్.. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజన్ డాక్యుమెంట్ ఖరారు..

9వ తేదీ సైతం అనేక సెషన్స్ ఉంటాయి. ఆ డిపార్ట్ మెంట్లకు సంబంధించిన మంత్రులు చూసుకుంటారు

Telangana Rising Global Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి ఫ్యూచర్ సిటీలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమ్మిట్ కు సంబంధించి మినిట్ టు మినిట్ వివరించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఈ నెల 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఉంటుందన్నారు. ఇది ఎకనామిక్ సమ్మిట్ అని తెలిపారు. 2047 కు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి 3 ట్రిలియన్స్ సాధించడమే టార్గెట్ అని చెప్పారు. నీతి అయోగ్, ఐఎస్బీ సలహాలు సూచనలతో విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్నారు.

”ఈ నెల 8న మధ్యాహ్నం 1:30 కు సమ్మిట్ ప్రారంభం అవుతుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్లోబల్ సమ్మిట్ ను ప్రారంభిస్తారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్.. ఒక ఎకనామిక్ సమ్మిట్. ఫ్యూచర్ సిటీలో సమ్మిట్ నిర్వహించడం సంతోషంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ అంతా కలిసి కూర్చుని విజన్ డాక్యుమెంట్ రూపొందించాము. ఈ నెల 8న 1:30 గంటలకు సమ్మిట్ మొదలై ఆరోజు సాయంత్రం ముగుస్తుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీద కార్యక్రమం లాంచ్ అవుతుంది. వివిధ దేశాల నుండి వచ్చే గొప్ప గొప్ప ఎకానమిస్టులు ప్రసంగిస్తారు. అలాగే నాతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు ఉంటాయి. అనంతరం అనేక డిపార్ట్ మెంట్లకు సంబంధించిన సెషన్స్ ఉంటాయి.

9వ తేదీ సైతం అనేక సెషన్స్ ఉంటాయి. ఆ డిపార్ట్ మెంట్లకు సంబంధించిన మంత్రులు చూసుకుంటారు. అనేకమంది ఎక్స్ పర్ట్స్ పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు క్లోజింగ్ సెరిమనీ ఉంటుంది. అందులో ఎవరెవరు పాల్గొంటారో మళ్ళీ తెలియచేస్తాము. ఈ గ్లోబల్ సమ్మిట్ కి 44 దేశాల నుండి 154 మంది డెలిగేట్స్ వస్తున్నారు. ఒక అమెరికా నుండే 46 మంది వస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నాము. స్వయంగా అధికారులు వెళ్లి ఆఫీషియల్ గా ఆహ్వానిస్తారు” అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

Also Read: ఇందిరమ్మ ఇండ్ల పథకంపై ప్రభుత్వం కీలక ప్రకటన.. వారికి శుభవార్త చెప్పిన మంత్రి పొంగులేటి

ఫ్యూచర్‌ సిటీ వేదికగా అంతర్జాతీయ ఆర్థిక సదస్సు నిర్వహణకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు రోజుల ఈ సదస్సు కోసం దేశ విదేశాల నుంచి ప్రముఖులు తరలిరానున్నారు. ఈ సమ్మిట్ లో పలు అంశాలపై 27 ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు.

100 ఎకరాలు.. భారీ ఏర్పాట్లు..

8, 9 తేదీల్లో రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలోని ఫ్యూచర్‌ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ, విదేశాల నుంచి దిగ్గజ పారిశ్రామికవేత్తలు.. సినీ, క్రీడా ప్రముఖులు హాజరు కానున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో వేదికలు సిద్ధం చేస్తున్నారు. 9వ తేదీన సాయంత్రం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్‌ మ్యాప్‌ను ప్రభుత్వం ప్రకటించనుంది.