Medaram Maha Jatara
Medaram Maha Jatara : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా గుర్తింపు పొందింది మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర. ఈ నెల 28 నుంచి 31 వరకు నాలుగు రోజులు అంగరంగ వైభవంగా జాతర జరగనుంది. ఇందుకోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. మేడారం జాతరకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు జాతరకు వస్తారు. ఈ క్రమంలో సమ్మక్క-సారలమ్మ జాతరకు టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక సేవలు ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా.. మేడారానికి బస్ ఛార్జీలు ఖరారు చేసింది.
మేడారం వెళ్లే మహిళలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మేడారం సమ్మక్క – సారక్క జాతరకు వెళ్లే మహిళలకు మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందని తెలిపింది. అయితే, తాజాగా.. వివిధ ప్రాంతాల నుంచి మేడారంకు వెళ్లే బస్సు చార్జీలను తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది.
మేడారం సమ్మక్క- సారక్క జాతరకు తెలంగాణ ఆర్టీసీ టిక్కెట్ల రేట్లను ఖరారు చేసింది. వరంగల్, హనుమకొండ, హైదరాబాద్ ప్రాంతాలతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మేడారానికి నడిపే ప్రత్యేక బస్సుల చార్జీలను నిర్ణయిస్తూ తెలంగాణ ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది.
భక్తులు ఎక్కువగా ప్రయాణించే వరంగల్, హనుమ కొండ ప్రాంతాల నుంచి బస్సుల ఆధారంగా రూ.250 నుంచి రూ.500 టిక్కెట్ చార్జీ ఉండగా.. హైదరాబాద్ నుంచి రూ.600 నుంచి రూ.1,110 వరకు టికెట్ రేట్లను నిర్ణ యించింది. అయితే, ‘మహాలక్ష్మి’ పథకంలో భాగంగా మహిళలు, బాలికలు, ట్రాన్స్ జెండర్లకు ప్రత్యేక ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణ సౌకర్యం వర్తిస్తుందని సంస్థ స్పష్టం చేసింది.
వివిధ ప్రాంతాల నుంచి మేడారంకు చార్జీలు (ఒక్కొక్కరికి) ఇలా..
♦ హైదరాబాద్ టూ మేడారం : రూ.600 (ఎక్స్ ప్రెస్), రూ.650 (సెమీ డీలక్స్)
♦ హనుమకొండ టూ మేడారం : రూ.250 (ఎక్స్‌ప్రెస్), కజ. 270 (సెమీ డీలక్స్).
♦ వరంగల్ టూ మేడారం : రూ. 250 (ఎక్స్ ప్రెస్), రూ.270 (సెమీ డీలక్స్).
♦ జనగామ టూ మేడారం : రూ.400 (ఎక్స్ ప్రెస్), రూ. 430 (సెమీ డీలక్స్)
♦ మహబూబాబాద్ నుంచి : రూ. 360 (ఎక్స్‌ప్రెస్)
♦ కరీంనగర్ నుంచి .. : రూ. 390 ((ఎక్స్‌ప్రెస్)
♦ ఖమ్మం నుంచి .. : రూ. 480 (ఎక్స్‌ప్రెస్)
♦ గోదావరిఖని నుంచి .. : రూ. 480 (ఎక్స్‌ప్రెస్)
♦ కొత్తగూడెం నుంచి .. : రూ.350 (ఎక్స్‌ప్రెస్)