RTC Free Travelling : పిల్లలకు శాశ్వతంగా ఉచిత ప్రయాణం..! ఆర్టీసీ న్యూఇయర్ కానుక..!

రాబోయే రోజుల్లో తెలంగాణలో 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఆర్టీసీ బస్సుల్లో శాశ్వతంగా ఉచిత ప్రయాణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు

RTC Free Travelling : కొత్త సంవత్సరాదిని పురస్కరించుకుని జనవరి 1న 12 ఏళ్ల లోపు చిన్నారులు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించిన టీఎస్ ఆర్టీసీ మరో ముందడుగు వేసింది. రాబోయే రోజుల్లో తెలంగాణలో 12 ఏళ్ల లోపు చిన్నారులకు ఆర్టీసీ బస్సుల్లో శాశ్వతంగా ఉచిత ప్రయాణం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు టీఎస్ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు.

WhatsApp Scam : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఆ లింక్ క్లిక్ చేస్తే మీ డబ్బు మాయం

చిన్నారులకు శాశ్వత ప్రయాణ సౌకర్యం కల్పిస్తే వారి తల్లిదండ్రులు కూడా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతారని, తద్వారా ఆర్టీసీ బస్సుల్లో సీటింగ్ ఆక్యుపెన్సీ రేషియో పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే ఇది కార్యరూపం దాల్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. హైదరాబాద్ బస్ భవన్ లో న్యూఇయర్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్ తో పాటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గొన్నారు.

కాగా, తెలంగాణ ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆర్టీసీ ఉద్యోగులు, ప్రయాణికుల సమస్యలపై సజ్జనార్ స్వయంగా స్పందిస్తూ.. వెంటనే చర్యలు తీసుకుంటున్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు పలు సంస్కరణలకు వీసీ సజ్జనార్ నాంది పలికారు. ప్రయాణికులను ఆకట్టుకునే విధంగా పలు కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు.

New Smartphones in 2022: జనవరి 2022లో వస్తున్న 5 టాప్ స్మార్ట్ ఫోన్స్

ఆర్టీసీ బ‌స్సుల్లో ఆక్యుపెన్సీ పెంచేందుకు, ప్రయాణికులను ఆక‌ట్టుకునేందుకు వినూత్నమైన కార్యక్రమాలకు నాంది పలుకుతున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని చిన్నారులకు చిరు కానుక ప్రకటించారు. నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 1న 12 ఏళ్లలోపు పిల్లలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించారాయన.

ట్రెండింగ్ వార్తలు