Varun Raj : అమెరికాలో తెలంగాణ విద్యార్థిపై కత్తితో దాడి.. పరిస్థితి విషమం

వరుణ్‌ రాజ్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం అతన్ని ఫోర్ట్ వేన్ ఆసుపత్రికి తరలించారు. వరుణ్ రాజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Thug Attacked Varun Raj

Thug Attacked Varun Raj : అమెరికాలో మరో భారతీయ విద్యార్థిపై హత్యాయత్నం జరిగింది. ఇండియానా రాష్ట్రంలో తెలంగాణ విద్యార్థిపై దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లాకు చెందిన 29 ఏళ్ల విద్యార్థి వరుణ్ రాజ్ పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన వరుణ్ రాజ్ పరిస్థితి విషమంగా ఉంది.

వివరాళ్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా మామిళ్లగూడెంకు చెందిన పుచ్చా వరుణ్ రాజ్ అమెరికా ఇండియానా రాష్ట్రంలోని ఓ విశ్వవిద్యాలయంలో ఎస్ ఎస్ చదువుతూ పార్ట్ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఇండియానా వాల్‌పరైసో నగరంలోని పబ్లిక్ జిమ్‌లో వరుణ్ రాజ్ ను దుండగుడు జోర్డాన్ ఆండ్రాడ్(24) కత్తితో పొడిచాడు.

Israel bombs : గాజా శరణార్ధుల శిబిరంపై ఇజ్రాయెల్ బాంబు దాడులు, హమాస్ కమాండర్ సహా ఉగ్రవాదుల హతం…10వేలకు చేరుకున్న మృ‌తుల సంఖ్య

వరుణ్‌ రాజ్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం అతన్ని ఫోర్ట్ వేన్ ఆసుపత్రికి తరలించారు. వరుణ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అతను అపస్మారక స్థితిలో ఉన్నాడు. అతను బతికే అవకాశం సున్నా నుండి ఐదు శాతం వరకు ఉన్నట్లు తెలిపారు. దాడి చేసిన దుండగుడిని పోలీసులు అరెస్టు చేశారు.

మారణాయుధంతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారనే ఆరోపణలతో దుండగుడిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మహబూబాబాద్ జిల్లాలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న వరుణ్ రాజ్ తండ్రి రామ్మూర్తి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను కలిసి తమ కుమారుడికి మెరుగైన వైద్యం అందేలా సాయం చేశాలని కోరారు.