Telangana : టీఆర్ఎస్ లో “టీటీడీపీ” విలీనం?

తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్‌తో ప్రగతి భవన్ సమావేశమయ్యారు. ఎల్. రమణతోపాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. అనంతరం బయటకు వచ్చిన ఎల్.రమణ మీడియాతో మాట్లాడారు.. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు ప్రగతి భవన్ కి వచ్చినట్లు తెలిపారు.

Telangana :  తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ గురువారం సాయంత్రం సీఎం కేసీఆర్‌తో ప్రగతి భవన్ సమావేశమయ్యారు. ఎల్. రమణతోపాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఉన్నారు. అనంతరం బయటకు వచ్చిన ఎల్.రమణ మీడియాతో మాట్లాడారు.. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు ప్రగతి భవన్ కి వచ్చినట్లు తెలిపారు.

భేటీలో తెలంగాణలో ఇప్పటివరకు జరిగిన అభివృద్ధి, ఇకపై చేయనున్న అభివృద్ధి పనులపై చర్చించినట్లు ఆయన వివరించారు. కేసీఆర్ కలిసి పనిచేద్దామని తెలిపారని, తమ పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశమై అతి త్వరలో పార్టీలో చేరేదానిపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

ఇక ఇదిలా ఉంటే టీటీడీపీని టీఆర్ఎస్ లో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తానని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. తన మిత్రులు, టీటీడీపీ నేతలతో చర్చించి పార్టీలోకి ఆహ్వానిస్తానని తెలిపారు. రమణను సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ లోకి రావాలని అహ్వాహించారని, రమణ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు ఎర్రబెల్లి వివరించారు. చేనేత వర్గ సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తున్న రమణ టీఆర్ఎస్ లోకి వస్తే వారికి మరింత న్యాయం చేయగలుగుతారని ఎర్రబెల్లి ఆశాభావం వ్యక్తం చేశారు.

ట్రెండింగ్ వార్తలు