L Ramana To TRS : టీ.టీడీపీకి భారీ షాక్ : టీఆర్ఎస్ లోకి ఎల్.రమణ..?!

మాజీ సీఎం తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు భారీ షాక్ తగలనుంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ గులాబీ కండువా కప్పుకోనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో చంద్రబాబు నాయుడు భారీ షాక్ తగలనుంది.

L Ramana may join in TRS party : తెలంగాణ టీడీపీకా భారీ షాక్ తగలనుంది. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షడు ఎల్.రమణ త్వరంలోనే గులాబీ కండువా కప్పుకోనున్నట్లుగా తెలుస్తోంది. దీంతో చంద్రబాబు నాయుడు భారీ షాక్ కానుంది. ఉమ్మడి ఏపీ రాష్ట్రం విడిపోయాక..కొత్త రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించాక. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీంతో అటు కాంగ్రెస్, ఇటు తెలుగుదేశం పార్టీలకుగడ్డుకాలం ఏర్పడింది.పలువురు నాయకులు టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు.

ఈక్రమంలో తెలంగాణలో టీడీపీకి మరో గట్టి దెబ్బ తగలనుంది. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ టీఆర్ఎస్ లోనే చేరునున్నట్లుగా తెలుస్తోంది. దీంతో తెలంగాణలో టీడీపీ చెప్పుకోదగిన నాయకులు లేనట్లుగానే ఉంది. గత కొంతకాలంగా ఎల్.రమణ టీఆర్ఎస్ లో చేరతారనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ రమణ మాత్రం ఇప్పటి వరకూ టీడీపీలోనే కొనసాగారు. కానీ మాజీ టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రస్తుత టీఆర్ఎస్ నేత లాబీయింగ్ తో రమణ కూడా గులాబీ గూటికే చేరున్నట్లుగా తెలుస్తోంది. రమణకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు గులాబీ బాస్ కేసీఆర్ సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. రమణతో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు మంచి సంబంధాలున్నాయి. ఈక్రమంలో రమణ పార్టీలో చేరటానికి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.మాజీ మంత్రి ఈటల పార్టీ నుంచి బైయటకు వెళ్లిపోవటం..ఆ స్థానాన్నిబీసీ నేత రమణతో భర్తీ చేయాలనుకంటున్నట్లుగా తెలుస్తోంది.

కరీననగర్ జిల్లాలో రమణ బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావటంతో రమణ చేరికతో లబ్ది పొందుదామనుకుంటోంది టీఆర్ఎస్. ఉమ్మడి ఏపీలో రమణ చంద్రబాబు కేబినెట్ లో మంత్రిగా పనిచేశారు. అనంతరం ఉమ్మడి ఏపీ విడిపోయింది. రాష్ట్ర విభజన అనంతరం కూడా రమణ టీడీపీలోనే కొనసాగారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా పార్టీని వీడలేదు. అటే టీఆర్ఎస్ హావా ఉన్నా..టీడీపీని తెలంగాణలో బలోపేతం చేయటాని రమణ ఎంతో కృషి చేశారు. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా పార్టీ మారేందుకు ఇష్టపడలేదు.కానీ రాను రాను టీడీపీ తెలంగాణలో కష్టసాధ్యంగా మారుతోంది. దీంతో రమణ తన రాజకీయ భవిష్యత్తు కోసం టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్దమైంది.తదపరు గులాబీ బాస్ కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చేందుకు కూడా అన్ని ఏర్పాటు జరిగినట్లుగా తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు