×
Ad

తెలంగాణ రైజింగ్-2047 విజన్‌ డాక్యుమెంట్‌లో పేర్కొన్న గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్స్ ఇవే..

పూర్తిగా కొత్త ప్రమాణాలతో, కొత్త దిశను ఏర్పరచుకుని భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కీలకమని అందులో పేర్కొన్నారు.

Telangana Rising 2047 Vision document: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేశారు. ఈ డాక్యుమెంట్‌ 83 పేజీలతో ఉంది. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో దీన్ని విడుదల చేశారు.

ఇందులో గేమ్ చేంజర్ ప్రాజెక్ట్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పూర్తిగా కొత్త ప్రమాణాలతో, కొత్త దిశను ఏర్పరచుకుని భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడంలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కీలకమని అందులో పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ అనేక గేమ్ ఛేంజర్ ప్రాజెక్టులను చేపడుతుందని చెప్పారు.

Also Read: 4 లక్షల మంది సూచనలు ఇచ్చారు.. విజన్ డాక్యుమెంట్‌ లక్ష్యం ఇదే: రేవంత్ రెడ్డి

ఈ ప్రాజెక్టుల్లో కొన్ని..

  •  భారత్ ఫ్యూచర్ సిటీ
  • మూసీ నది పునరుద్ధరణ
  •  డ్రై పోర్ట్
  •  కృష్ణపట్నం సముద్ర పోర్ట్‌ (ఏపీ)కి డ్రై పోర్ట్‌ను కలిపే 12-లేన్ ఎక్స్‌ప్రెస్‌వే
  •  హైదరాబాద్‌-బెంగుళూరు, హైదరాబాద్‌-చెన్నై (అమరావతి, ఏపీ ద్వారా) బుల్లెట్ ట్రైన్ కారిడార్లు
  •  మాన్యుఫాక్చరింగ్ జోన్లు (ఓఆర్ఆర్, ఆర్ఆర్‌ఆర్ మధ్య)
  •  రీజినల్ రింగ్ రోడ్
  •  రేడియల్ రోడ్లు (ఆర్ఆర్‌ఆర్, ఓఆర్ఆర్‌ను కలిపే రోడ్లు)
  •  రీజినల్ రింగ్ రైల్వే
  •  వ్యవసాయ ఫాంలకు గ్రీన్ పవర్
  •  ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌లు
  •  గ్రీన్ ఎనర్జీ హబ్‌లు
  •  భారీగా ఎలక్ట్రిక్ వాహనాల అడాప్షన్