×
Ad

ఎల్లో అలర్ట్ జారీ.. 4 రోజులు కుమ్మేయనున్న వర్షాలు.. ఈ ప్రాంతాల్లోనే..

పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయి.

Heavy Rains

Weather Updates: తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ద్రోణి ప్రభావంతో పాటు క్యూములోనింబస్ కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం రికార్డయ్యే అవకాశం ఉందని తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని చెప్పింది.

పలుచోట్ల గంటకు 30-40 కి.మీ వేగంతో, మరికొన్ని ప్రాంతాల్లో 40-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది.

ములుగు, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, జనగామ, హనుమకొండ, ఖమ్మం, వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.

Also Read: పూజలు చేసినా మీ దోషం పోవడం లేదా? నిజమైన రెమెడీస్ ఇవే.. ఇలా చేశారంటే మీకు పట్టిన దరిద్రమంతా..

మరోవైపు, నిన్న తెలంగాణలోని దక్షిణ జిల్లాలు మినహా అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. కామారెడ్డి, జగిత్యాల, భద్రాద్రి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో కుండపోత వర్షాలు పడ్డాయి. ములుగు జిల్లా మల్లంపల్లిలో అత్యధికంగా 9.8 సెంటీ మీటర్ల వర్షం పడింది.

నేడు ఈ ప్రాంతాల్లో వర్షాలు
ఇవాళ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు మెదక్, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, మహబూబ్‌నగర్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూల్, కరీంనగర్, రంగారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పింది.