పూజలు చేసినా మీ దోషం పోవడం లేదా? నిజమైన రెమెడీస్ ఇవే.. ఇలా చేశారంటే మీకు పట్టిన దరిద్రమంతా..
జాతక చక్రములలో మిగతా గ్రహములను నక్షత్రములను దశలను పరిశీలించాలి. సరైన విధానము తెలియకుండా పూజలను నిర్వహిస్తే ఫలితములను పొందలేరు. - ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన వివరాలు..

kaal sarp dosh
Kaal Sarp Dosh: రాహుకేతువుల మధ్య సప్తగ్రహములు బంధించి ఉంటే దానిని కాలసర్ప యోగము అంటారు. ఈ కాలసర్పయోగము గురించి చాలామంది “మేము పూజలు చేశామండి.. మరి మాకు ఫలితం కనిపించలేదు. మేము పవిత్రమైన క్షేత్రములలో చేశాము మాకు ఫలించలేదు” అని అంటున్నారు. మరికొంతమంది “ఆ దేవాలయాలలో స్థలమహత్యము ఉంటుంది అనుకొని పూజలు చేశాము మాకు పనులు నెరవేరలేదు” అంటారు.
ఏమిటి కారణం? చాలామందికి వస్తున్న సందేహము ఇది. అసలు విషయం ఏమిటి? వాస్తవంగా కృత, త్రేత, ద్వాపర, కలియుగాలలో ఎంతోమంది మహర్షులు ఎంతో దీక్షతోటి చాలా సంవత్సరములు అరణ్యంలో తపస్సు చేసుకొనేవారు ఎంతో నిష్ఠగా ఉండి ఘోరతపస్సు చేసిన రావణబ్రహ్మకు కూడా పరమేశ్వరుని మెప్పించటానికి చాలా రోజులు పట్టింది. (Kaal Sarp Dosh)
అలాంటి ఏదో దేవాలయాలకి వెళ్లి గోత్రనామాలు చెప్పి కాలసర్పదోషనివారణ చేయండి అని చెపితే సరిపోతుందని అనుకుంటారు. అక్కడ స్థలమహత్యము ఉంటుంది కదా అని కొంతమంది ప్రశ్న మరి స్థల మహత్యము అయితే అక్కడకు వెళ్లిన ప్రతి వారికి దోషనివారణ జరుగుతున్నదా. కొంతమందికి జరుగుతున్నది. మరికొంత మందికి జరగదు.
Also Read: కాలసర్పయోగము అంటే ఏంటి? మీకు ఉందా? తీవ్ర పరిణామాలు ఇవే.. అనుభవించక తప్పదు
దీనికి కారణం వాస్తవంగా సరియైన పద్ధతిలో సత్ బ్రాహ్మణులతో రాహుకేతువుల జపములు ముఖ్యమైనవి, రాహుమంత్రము 18వేలు కేతుమంత్రము 7 వేలు సార్లు ఉచ్ఛారణ లోపం లేకుండా చేయాలి. ప్రతిరోజు జంట సర్పములకు అభిషేకములు, హోమములు, మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకము మొదలుగున్నవి. శాస్త్రీయ పద్ధతిలో చేయాలి. బ్రాహ్మణోత్తములే కాక చేపించుకొనే యజమాని కూడా నిష్ఠగా ఓపికతో ఉండవలెను. యజమాని పూజ చేసే రోజులలో మంధు, మాంసములను విసర్జించాలి.
ఈ రాహుకేతువుల జపములు 25 వేలసార్లు చేయాలంటే దాదాపుగా నాలుగు రోజులు అవుతుంది. ఈ నాల్గు రోజులు బ్రాహ్మణుల సంఖ్యను బట్టి ఉంటుంది. బ్రాహ్మణులు ఎక్కువమంది తక్కువ రోజులలో పూర్తి అవుతుంది. నాల్గు, ఐదురోజులలో పూర్తి అయిపోయే దానిని దేవాలయములలో గంటలో పూర్తికావడం అనేది జరగదు. ఎంతో నిష్ఠగా భక్తిగా ఆచరించాలి. ఈ కాలసర్పయోగం గురించే కాదు.
ఏపూజ అయినా చేస్తే నిష్టగా భక్తితో ఆచరించాలి. లేకపోతే మానివేయడం మంచిది. ధనము వృథా, కాలము వృథా అవుతుంది. అంత ధనము ఉపయోగించాము అంటే అంతఫలితమును పొందాలి. ఇవ్వన్నీ క్యూ ద్వారా వచ్చి గోత్రనామాలు చెప్పి ఒక గంటలో పూర్తి చేసి కాలసర్పయోగము పోయిందిలే అని అనుకుంటే పొరపాటు. అలాగే శాస్త్రీయపద్ధతిలో నాగప్రతిష్ఠ చేయుట కాలసర్పయోగము ఉన్నవారు ఈనాగప్రతిష్ఠ దేవాలయములలో గాని, నదీతీరసమీపంలో గాని, అశ్వర్థమూలమునందు అనగా రావి వేపచెట్టు ముందుగాని చేయాలి.
గృహములో కూడా పూజలు నిర్వహించి దేవాలయంలో గానీ, నదీ తీరముల యందుగాని నాగప్రతిమలను ఉంచవచ్చు. నాగప్రతిష్ఠ విధిగా చేయాలి. సర్పసంస్కారము చేసి నాల్గవరోజున సర్పబలి ఎనిమిది మంది బ్రాహ్మణోత్తములచే పురుషసూక్తముచే పూజించడం మొదలుగునవి చేయాలి. మొదటగా హోమము బ్రాహ్మణ పూజ, భోజనము, పాయసబలి, కలశస్థాపన, కలశపూజ, దానమును కలశ వస్త్ర, ప్రతిమ దానమును, బ్రాహ్మణ సమారాధన చేయడం మంచిది.
ఈ ప్రకారముగా చేసిన కాలసర్పదోషము తొలగుతాయి. అశ్వత్థ వివాహము చేసిన తర్వాత నాగప్రతిష్ఠ చేయాలి. అశ్వర్థము అనగా రావిచెట్టుకు, వేపచెట్టుకు వివాహము చేసిన అశ్వర్ధము అంటారు. వివాహము కాని అశ్వర్థము నందు నాగప్రతిష్ఠ చేయరాదు. కాలసర్పయోగములలో 12 రకములైన కాలసర్పయోగములు ఉన్నాయి. ఒక్కొక్క కాలసర్పయోగమునకు ఒక్కొక్క విదముగా పూజలు ఉంటాయి. పూజల విధానములలో మార్పులు ఉంటాయి.
ఉదాహరణకు అనంతకాలసర్పయోగమునకు పూజా విధానము వేరు మరో కాలసర్పయోగమునకు పూజా విధానము వేరుగా ఉంటుంది. దీనితోపాటు జాతక చక్రములలో మిగతా గ్రహములను నక్షత్రములను దశలను పరిశీలించాలి. సరైన విధానము తెలియకుండా పూజలను నిర్వహిస్తే ఫలితములను పొందలేరు.
నాగ దోషములకు కూడా జాతకమును అనుసరించి వివిధ రకముల పూజలుంటాయి. కేవలం ప్రతిదానికి నాగప్రతిష్ఠనే కాదు దానికి మరికొన్ని పద్ధతుల ప్రకారంగా పూజలు నిర్వహించాలి. కాలసర్పయోగము పరిహారానికి శాస్త్రీయ పద్ధతిలో పూజలను చేసి, ఆ తరువాత దేవాలయములలో పూజలు చేసుకోవాలి.
పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Ph: 9849280956, 9515900956