కాలసర్పయోగము అంటే ఏంటి? మీకు ఉందా? తీవ్ర పరిణామాలు ఇవే.. అనుభవించక తప్పదు
ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన వివరాలు..

Kaal Sarp Dosh
Kaal Sarp Dosh: జాతక చక్రంలో రాహు కేతువుల మధ్య మిగతా గ్రహాలు ఉంటే దానిని కాలసర్పయోగముగా నిర్వచిస్తారు. ఈ సర్పయోగము వల్ల జీవితంలో దుష్పలితాలు అనుభవించక తప్పదు. సర్పయోగ జాతకుడు సిరిసంపదలు ఉన్నప్పటికీ సుఖజీవనాన్ని సాగింపలేడు.
వివాహము, సంతానము, ఆరోగ్యము, సంపద విషయంలో జాగ్రత్త అవసరము. మరణానంతరము కూడా ఈ సర్పదోష ప్రభావము ఉంటుంది. ఈ కాలసర్ప దోషము వంశపారం పర్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. (Kaal Sarp Dosh)
ఇటువంటి జాతకుడి జీవితంలో అభివృద్ధి ఉండదు. ఎంత కష్టపడినా ఫలితం లభించక పోవడంతో మధ్యలో ముందంజ ఉండదు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటాయి. సంతృప్తిలేని జీవితాన్ని గడుపుతారు. రుణబాధలు, విపరీతమైన వ్యాధులు వస్తాయి. శస్త్రచికిత్స వల్ల మరణం, అకాల మరణం, విష జంతువుల వల్ల ప్రాణహాని, వాహన ప్రమాదములు.
Also Read: సింగరేణి కార్మికులకు మరో శుభవార్త.. ఒక్కొక్కరికి బోనస్ ఎంతంటే? కిషన్ రెడ్డి ప్రకటన..
మరికొన్ని తీవ్ర పరిణామాలు
1. జ్ఞాన దృష్టి లేకపోవుట లేక మెదడు ఎదగకపోవటం వల్ల అనుమానాలు (లేక) అపార్థములు చేసుకొనుట
2. జన్మించిన సంతానమునకు బుద్ధిమాంధ్యము కలుగుట
3. గర్భములో శిశువు మరణించుట
4. భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవుట (లేక) వైవాహిక జీవితంలో అసంతృప్తి
5. మరణించిన శిశువులను ప్రసవించుట
6. గర్భము నిలువకపోవుట
7. విచిత్రమైన రోగాలు కలగడం
8. అంగవైకల్యంతో సంతానము కలుగుట
9. వాహన ప్రమాదములు
10. శస్త్రచికిత్సలు విఫలమై మరణించుట
11. వృషణముల వ్యాధులు ఏర్పడుట
12. వ్యసనములకు బానిసకావడం
13. నపుంసకత్వము ఏర్పడుట
14. వీర్యకణములు నశించుట
15. ఎయిడ్స్, క్యాన్సర్, సిఫిలిన్, హెర్నియా, మూత్ర సంబంధ వ్యాధులు
16. కుటుంబంలో ప్రేమాభిమానాలు తగ్గుట
17. వంశ వృద్ధి లేకపోవుట
18. మొండి పట్టుదల
19. శత్రువుల వల్ల మృతి చెందుట
20. జన్మించిన సంతానం శత్రువులుగా మారడం
21. మానసిక శాంతి లేకపోవటం
22. విషజంతువుల వల్ల, జలప్రమాదముల వల్ల మరణం కలగడం
23. అవమానాలు (లేక) అపనిందల వల్ల మృతి చెందుట
24. రుణగ్రస్తులు కావడం
25. పరస్త్రీల సంపర్కము
పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Ph: 9849280956, 9515900956