సింగరేణి కార్మికులకు మరో శుభవార్త.. ఒక్కొక్కరికి బోనస్ ఎంతంటే? కిషన్‌ రెడ్డి ప్రకటన..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు.

సింగరేణి కార్మికులకు మరో శుభవార్త.. ఒక్కొక్కరికి బోనస్ ఎంతంటే? కిషన్‌ రెడ్డి ప్రకటన..

Updated On : September 26, 2025 / 4:02 PM IST

Singareni workers bonus: సింగరేణి కార్మికులకు మరో శుభవార్త. స్వర్ణోత్సవ సంబరాలు, దసరా, దీపావళి పండగలను పురస్కరించుకుని బోనస్ ప్రకటించారు బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి. ఈ మేరకు ఎక్స్ లో ఓ పోస్ట్ చేసి, వివరాలు తెలిపారు.

కార్మికుల పనితీరుకు, వారి కష్టానికి గుర్తింపుగా.. కోలిండియా, సబ్సిడరీస్‌కు చెందిన 2.09 లక్షల మంది కార్మికులు, సింగరేణికి సంబంధించిన 38 వేల మంది కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,03,000 చొప్పున బోనస్ ప్రకటించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కార్మికుల సంక్షేమంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. దీన్ని కోలిండియా ఆచరణలో పాటిస్తూ.. కార్మికుల సంక్షేమం పట్ల, వారి పురోగతి పట్ల శ్రద్ధ వహిస్తోందని చెప్పారు.

సింగరేణి కార్మికులకు ఇటీవలే తెలంగాణ సర్కారు కూడా బోనస్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సారి 34 శాతం వాటాను పంచాలని నిర్ణయం తీసుకున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆ సమయంలో అన్నారు. ఒక్కో కార్మికుడికి బోనస్‌గా రూ.1,95,610 పంపిణీ చేస్తున్నారు. మొత్తం రూ.819 కోట్లను సింగరేణి కార్మికులకు పంపిణీ అవుతోంది.