Weather Warning : తెలంగాణకు చల్లని కబురు

రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత రెండు రోజుల కింద...

Weather Forecast : తెలంగాణ రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం నుంచే సూర్యుడు భగభగలాడిస్తున్నాడు. మధ్యాహ్నం వేళ విపరీతమైన ఎండతో పాటు ఉక్కపోతతో ప్రజలు సతమతమౌతున్నారు. దీంతో ఇంటి నుంచి బయటకు రావడానికే జంకుతున్నారు. ఈ పరిస్థితుల్లో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Read More : Weather Forecast : తెలంగాణలో ఇవాళ, రేపు వానలు

ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. 30 నుంచి 40 కి.మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఏప్రిల్ 20వ తేదీ బుధవారం ఉపరితల ద్రోణి రాయలసీమ నుండి ఇంటీరియర్ తమిళనాడు మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9కి. మీ ఎత్తు వద్ద కొనసాగుతోందని తెలిపారు.

Read More : Weather Forecast : తెలంగాణలో ఈరోజు వానలు కురిసే అవకాశం

క్రింది స్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ మరియు నైరుతి దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నట్లు, ఈ కారణంగా..రాగల మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గత రెండు రోజుల కింద హైదరాబాద్ లో వర్షం కురిసిన సంగతి తెలిసిందే. పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. ఎండలు, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు ఒక్కసారిగా వర్షం కురవడంతో ఉపశమనం పొందారు.

ట్రెండింగ్ వార్తలు