Weather Forecast : తెలంగాణలో ఈరోజు వానలు కురిసే అవకాశం
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. గురు,శుక్ర వారాలు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ

weather forcast
Weather Forecast : పశ్చిమ విదర్భ నుండి మరాట్వాడా, కర్ణాటక మీదుగా ఉత్తర ఇంటీరియర్ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి సుమారు 0.9 కిమి ఎత్తు వద్ద ఉన్న నిన్న ఏర్పడిన ఉపరితల ద్రోణి ఈరోజు స్థిరంగా కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
దీని ప్రభావం వలన ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఒకటిరెండు చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. గురు,శుక్ర వారాలు తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Also Read : TS Governor Tamili : ‘తెలంగాణలో ఏం జరుగుతుందో అందరికీ తెలుసు..నేను ప్రత్యేకించి ప్రధానికి చెప్పనవసరం లేదు’..