Telangana Covid curve: తెలంగాణలో జూన్ నుంచి కరోనా కేసులు పెరగవ్ – ఐఐటీ మోడల్

అనుమానస్పదంగా, గుర్తు పట్టలేనట్లుగా, పాజిటివ్ గా తేలిన కేసులన్ని మే 12 నాటికి పీక్స్ లో నమోదవుతాయి.

Telangana Covid curve: అనుమానస్పదంగా, గుర్తు పట్టలేనట్లుగా, పాజిటివ్ గా తేలిన కేసులన్ని మే 12 నాటికి పీక్స్ లో నమోదవుతాయి. రోజువారీ కేసులు 9వేల నుంచి 9వేల 500 వరకూ ఉండొచ్చని చెబుతుంది మ్యాథమ్యాటికల్ మోడల్. కాకపోతే మంచి విషయమేమిటంటే.. జూన్ 21 నుంచి కరోనా కేసులు పెరగవని కాకపోతే మే 12నుంచి మే20వరకూ దారుణంగా కేసులు పెరిగే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించింది.

ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మనీంద్రా అగర్వాల్ కంప్యూటేషనల్ మోడల్ గురించి వివరిస్తూ.. తెలంగాణలో ఊహించిన దాని కంటే కొంచెం అటుఇటుగా ఫలితాలు రానున్నాయి. ఈ మోడల్ ప్రకారం.. మే20 నుంచి తెలంగాణలో కేస్ లోడ్ అనేది తగ్గుతూ వస్తుంది. కేసులు తగ్గి జూన్ 21 నాటికి ఒకేలా మెయింటైన్ అవుతాయి.

ఐఐటీ కాన్పూర్, ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ల టీం ఈ రకమైన అంచనాలుంటాయని చెప్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే రోజుకు పదివేల కేసులు నమోదవుతున్నాయి. సోమవారం 10వేల 122కేసులు నమోదయ్యాయి. మహమ్మారి మొదలైన నాటి నుంచి ఒక రోజులో ఎక్కువ కేసులు నమోదవడం ఇదే తొలిసారి. తెలంగాణలో ఈ నమోదైన అతి పెద్ద నెంబర్ ఇదే.

ఏదేమైనా 10వేల మార్కు చేరిన తర్వాత రాష్ట్రంలో కేసుల సంఖ్య 6వేల 500 నుంచి 8వేలకు మధ్యలో ఉండాలి. హెల్త్ డిపార్ట్ మెంట్ ఇచ్చిన లెక్కల ప్రకారం.. కొవిడ్ కేసులు ములుగులోనే తక్కువగా ఉన్నాయి. మే2న కేవలం 21కేసులు మాత్రమే నమోదయ్యాయి.

ములుగు మినహాయించి ఇతర 17జిల్లాల్లో వారానికి 100కంటే తక్కువ కేసులే నమోదయ్యాయి. నారాయణ్ పేట్, మెదక్, నిర్మల్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కుమరం భీం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్ లలో నమోదవుతున్న కేసులు చూస్తుంటే రాష్ట్రంలో కొద్ది చోట్ల మాత్రమే కేసుల నమోదు ఎక్కువగా ఉందని తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు