Telangana Schools : తెలంగాణ స్కూళ్లలో తప్పనిసరి సబ్జెక్ట్‌గా తెలుగు

తెలంగాణలోని అన్నీ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి 4,9 తరగతుల్లో తప్పనిసరి సబ్జెక్ట్ గా తెలుగు ఉండాలని విద్యాశాఖ అధికారులు డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు.

Telangana Schools : తెలంగాణలోని అన్నీ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి 4,9 తరగతుల్లో తప్పనిసరి సబ్జెక్ట్ గా తెలుగు ఉండాలని విద్యాశాఖ అధికారులు డీఈవోలకు ఆదేశాలు జారీ చేశారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ తదితర బోర్డు పాఠశాలల్లోనూ కచ్చితంగా అమలయ్యేలా చూడాలని రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా మండలి డీఈఓలకు ఆదేశాలు జారీ చేసింది.

స్కూళ్లలో తెలుగు ఓ సబ్జెక్ట్ గా కచ్చితంగా బోధించేలా 2018 లో ప్రభుత్వం ఒక చట్టాన్ని రూపోందించింది. దశలవారీగా 2018-19 విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేలా విద్యాశాఖ పరిధిలోని ఎన్‌సీఈఆర్‌టీ ప్రణాళిక రూపోందించింది. ఇప్పటి వరకు 1 2 3 6 7 8 తరగతుల్లో తెలుగును ఓ బోధనాంశంగా తప్పని సరి చేసింది ప్రభుత్వం.

ఈ విద్యాసంవత్సరం నుంచి 4,9 తరగతుల్లో  తెలుగు తప్పని సరి చేసింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 5, 10 తరగుతుల్లోనూ తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్ గా అమలు చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు రాష్ట్రంలోని తెలుగు,ఇంగ్లీషు మీడియం పాఠశాలల్లో తెలుగును ఒక సబ్జెక్ట్ గానే బోధిస్తున్నారు. ఇతర పాఠశాలల్లో తెలుగు అమలు కావటం లేదు.

అదేవిధంగా సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఐబీ వంటి బోర్డు పాఠశాలల్లోనూ 9,10 తరగతుల్లో తెలుగు అమలు కావటం లేదు. ఈ పరిస్ధితుల్లో క్షేత్ర స్ధాయిలో తగిన చర్యలు తీసుకోవాలని ఎన్‌సీఈఆర్‌టీ  డైరెక్టర్ విద్యాశాఖను ఆదేశించారు.

ట్రెండింగ్ వార్తలు