South Central Railway
Platform Ticket Price: దసరా పండుగ సందర్బంగా రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోతుంది. ప్రయాణికులతో పాటు వాళ్ల బంధువులు కూడా ఎక్కువ సంఖ్యలో రావడంతో రద్దీని నివారించేందుకు దక్షిణ మధ్య రైల్వే శాఖ ప్లాట్ ఫాం టికెట్ ధరను భారీగా పెంచింది. కాచిగూడ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం టికెట్ ధరను తాత్కాలికంగా రూ. 10 నుంచి రూ. 20వరకు పెంచినట్లు ప్రకటించింది. పెంచిన ధరలు సోమవారం నుండి అమల్లోకి వచ్చాయి. వచ్చే నెల 9వ తేదీ వరకు ఈ ప్లాట్ పాం ధరల పెంపు అమల్లో ఉంటుందని రైల్వే శాఖ పేర్కొంది.
Temporary Increase in Platform Ticket Price at #Kacheguda Railway Station during #Dussehra Festival Season @drmhyb @drmsecunderabad pic.twitter.com/se9Vkp87aU
— South Central Railway (@SCRailwayIndia) September 26, 2022
ఇదిలాఉంటే దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం నాలుగు ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈనెల 28న సికింద్రాబాద్ – యశ్వంత్ పూర్ కు, 29న యశ్వంత్ పూర్ – సికింద్రాబాద్ కు, అక్టోబర్ 9న తిరుపతి – సికింద్రాబాద్ కు, 10న సికింద్రాబాద్ – తిరుపతికి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది.