Hyderabad Tank Bund
Hyderabad Tank Bund : వినాయక నిమజ్జనం వేళ హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై ఉధ్రిక్తత నెలకొంది. గణేశ్ నిమజ్జనానికి ట్యాంక్ బండ్ పై అనుమతి ఇవ్వాలంటూ భాగ్యనగర్ ఉత్సవ సమితి నేతలు ఆందోళనకు దిగారు. ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ పోలీసులు ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలను, భారీకెడ్లను భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు తొలగించారు. ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన జాలీలనుసైతం తొలగించి వినాయకుని నిమజ్జనం చేశారు.
Also Read : ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు పోటెత్తిన భక్తులు.. ఇవాళ అర్థరాత్రి వరకే అనుమతి
ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం అనేక సంవత్సరాలుగా జరుగుతుంది.. కొత్త రూల్స్ తీసుకువచ్చి ప్రభుత్వం, పోలీసులు భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని గణేశ్ ఉత్సవ సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తంచేశారు. 2022లో, 2023లో కూడా ఇదే విధంగా చెప్పారు. కానీ, చివరకు ట్యాంక్ బండ్ వద్దే గణేశ్ నిమజ్జనాలు జరిగాయని అన్నారు. ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్ పై గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు చేయాలని, లేనిపక్షంలో ఈరోజు అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం తెలియజేసి సోమవారం నగరవ్యాప్తంగా ఆందోళన చేస్తామని తెలిపారు. ఎక్కడికక్కడ మండపాల్లో గణనాథులను అదేవిధంగా ఉంచుతామని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు హెచ్చరించారు.
Also Read : Balapur Ganesh : లక్షలు కట్టాల్సిందే.. బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంలో కొత్త నిబంధనలు