TG Congress PAC meeting: పీఏసీ సమావేశానికి తొలిసారి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్

కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ అధ్యక్షతన పీఏసీ సమావేశం జరగనుంది.

హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఇవాళ సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సమావేశం కానుంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరుగుతున్న మొదటి పీఏసీ సమావేశం ఇది. పీఏసీ సమావేశానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ రానున్నారు. దీంతో మరింత ఆసక్తి పెరిగింది.

సామాన్యంగా పీఏసీ సమావేశాలకు పీఏసీ సభ్యులతో పాటు పార్టీ ఇన్‌చార్జ్‌ హాజరవుతుంటారు. కేసీ ఎందుకు వస్తున్నారని పార్టీ నేతల్లో సీరియస్‌గా చర్చ జరుగుతోంది. దీంతో కాంగ్రెస్ నేతల్లో టెన్షన్ మొదలైందని తెలుస్తోంది.  కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ అధ్యక్షతన పీఏసీ సమావేశం జరగనుంది.

పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, 23 మంది పీఏసీ సభ్యులు పాల్గొంటారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఏడాది పాలన మంత్రుల, ఎమ్మేల్యేల ప్రోగ్రెస్ రిపోర్ట్, స్థానిక సంస్థల ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్టీ కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించనున్నారు.

జనవరి 26 నుంచి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా వేయనున్న విషయం తెలిసిందే. అలాగే, స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. దానికి అనుగుణంగా కార్యాచరణ ప్రణాళిక వేయనుంది కాంగ్రెస్‌.

HMPV virus cases: హెచ్‌ఎంపీవీ కేసులపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం