Exam
తెలంగాణలో ఈ నెల 21 నుంచి టెన్త్ క్లాస్ పరీక్షలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలు వచ్చే నెల 4వ తేదీ నాటికి పూర్తవుతాయి. ఈ తర్వాత ఒకటి నుంచి తొమ్మిదో తరగతి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పరీక్షల తేదీలపై విద్యాశాఖ ప్రకటన చేసింది.
వచ్చేనెల 9 నుంచి 17 వరకు సమ్మేటివ్ అసెస్‌మెంట్ 2 పరీక్షలు ఉంటాయని చెప్పింది. ఈ షెడ్యూల్‌ను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి రిలీజ్ చేశారు. పరీక్షల అనంతరం వచ్చేనెల 23న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి ప్రొగ్రెస్ కార్డులను అందజేస్తారు. రిపోర్టును అందజేయాలని సూచించారు.
టాస్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి..
టాస్ (తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం) సమక్షంలో టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ వచ్చేనెల 20 నుంచి 26 వరకు జరరగనున్నాయి. ఈ మేరకు టాస్ డైరెక్టర్ పీవీ శ్రీహరి ఓ ప్రకటనలో వివరాలు తెలిపారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ వచ్చే నెల 26 నుంచి మే 3 వరకు ఉంటాయన్నారు.