KV Admission: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు.. మీ పిల్లలను ఇలా ఆ స్కూళ్లలో చేర్పించండి.. తుది గడువు ఎప్పుడో తెలుసా?

ఫస్ట్‌ క్లాస్‌లో చేరడానికి ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

KV Admission: కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు.. మీ పిల్లలను ఇలా ఆ స్కూళ్లలో చేర్పించండి.. తుది గడువు ఎప్పుడో తెలుసా?

Updated On : March 14, 2025 / 2:49 PM IST

కేంద్రీయ విద్యాలయాల్లో తమ పిల్లలను చదివించాలని చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటారు. ఈ స్కూళ్లలో ఎలా చేర్పించాలో చాలా మందికి తెలియదు. వాటిలో సీటు పొందడం కష్టతరమే. ఫస్ట్ క్లాస్‌లో పిల్లలను చేర్చాలనుకునేవారు ప్రయత్నాలు జరిపితే ఫలితం ఉంటుంది.

ఇక మిగిలిన క్లాసుల్లో సీట్లు ఖాళీగా ఉంటే అందులో చేరే ఛాన్స్‌ ఉంటుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 కింద ఫస్ట్‌ క్లాస్‌లో అడ్మిషన్లకు పిల్లలకు ఆరేళ్లు నిండాలి. కేంద్రీయ విద్యాలయాల్లోని ప్రతి స్కూల్‌లో ఫస్ట్ క్లాస్‌లో ఒక సెక్షన్‌ ఉంటుంది.

ఆ స్కూల్‌ ఉన్న ప్రాంతాన్ని బట్టి అందులో 20-60 మధ్య సీట్లు ఉంటాయి. కొన్ని స్కూళ్లలో ఫస్ట్‌ క్లాస్‌లో 2 నుంచి 5 సెక్షన్ల వరకు ఉంటాయి. మరికొన్ని ప్రాంతాల్లో మార్నింగ్, ఆఫ్టర్‌నూన్‌ షిఫ్టుల్లో క్లాస్‌లు ఉంటాయి. దీంతో వీటి ద్వారా ఎక్కువ మంది పిల్లలు ఇందులో చేరే ఛాన్స్ ఉంటుంది.

విద్యాహక్కు చట్టం కింద 25% సీట్లను ముందుగానే భర్తీ చేస్తారు. అప్లికేషన్లను కలిపి డ్రా తీస్తారు. ఇందులో ఎంపికైనవారికి ఫీజు ఉండదు. 15% సీట్లను ఎస్సీలకు, 7.5% ఎస్టీలకు కేటాయిస్తారు. మరో 27% సీట్లను ఓబీసీ నాన్‌ క్రీమీ లేయర్‌కు కేటాయిస్తారు. 2 సీట్లు సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ కు ఇస్తారు.దివ్యాంగులకు 3% సీట్లు కేటాయిస్తారు.

Also Read : హోలీ ఆడేటప్పుడు మీ స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్లపై రంగు పడిందా? డోంట్ వర్రీ.. ఈ 5 సేఫ్టీ టిప్స్ ద్వారా క్లీన్ చేయొచ్చు..!

వీటి అప్లికేషన్లను లాటరీతో తీస్తారు. ఫస్ట్‌ క్లాస్‌లో చేరడానికి ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 2 నుంచి 8వ తరగతి వరకు ఖాళీలు ఉంటే ఆ స్కూల్ ప్రిన్సిపల్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో లాటరీ తీస్తారు. తొమ్మిదో క్లాస్‌లో ప్రవేశాలకు పరీక్ష ఉంటుంది. ప్లస్‌ 1లో ప్రవేశాలు టెన్త్ పరీక్షల్లో సాధించిన మార్కులతో ఇస్తారు. కేంద్రీయ విద్యాలయాల్లో విద్యనభ్యసించిన వారికి ప్రాధాన్యం ఉంటుంది. సీట్లు మిగిలితే ఇతర బోర్డుల్లో చదివిన వారికి కేటాయిస్తారు.

ఫస్ట్ క్లాస్‌లో ప్రవేశాలకు ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఇప్పటికే స్వీకరిస్తున్నారు.. తుది గడువు మార్చి 21 వరకు ఉంది. మిగతా తరగతుల్లో దరఖాస్తులకు దరఖాస్తుల స్వీకరణ: ఏప్రిల్‌ 2 నుంచి 11 వరకు ఉంటుంది. ఫస్ట్ క్లాస్‌లో ప్రవేశాలకు విద్యార్థి వయసు 2025, మార్చి 31 నాటికి ఆరేళ్లు నిండాలి

ఇలా దరఖాస్తు చేసుకోండి..

  • kvsangathan.nic.in ఓపెన్ చేయండి
  • హోమ్‌పేజీలో “అడ్మిషన్ 2025-26” లింక్‌పై క్లిక్ చేయండి
  • “న్యూ రిజిస్ట్రేషన్”పై క్లిక్ చేయండి
  • మీ పిల్లల పేర్లు, పుట్టిన తేదీ, తల్లిదండ్రుల సమాచారం, ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ సహా అవసరమైన వివరాలను నమోదు చేయండి
  • రిజిస్టర్డ్ ఈ మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి లాగిన్ చేయండి
  • వ్యక్తిగత వివరాలు, తల్లిదండ్రుల సమాచారం, మీ పిల్లల్ని చేర్పించాలనుకుంటున్న కేంద్రీయ విద్యాలయ పాఠశాల పేరుతో దరఖాస్తు ఫాంను నింపండి
  • పిల్లల జనన ధృవీకరణ పత్రం, ఫొటోగ్రాఫ్, చిరునామా వంటి పత్రాలను స్కాన్ చేసి, కాపీలను అప్‌లోడ్ చేయండి
  • దరఖాస్తు ఫాంను సబ్మిట్‌ చేయండి
  • క్రెడిట్/డెబిట్ కార్డ్‌లు, నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐ ద్వారా ఆన్‌లైన్ చెల్లింపులను ఉపయోగించి దరఖాస్తు రుసుము చెల్లింపును పూర్తి చేయండి

ముఖ్యమైన పత్రాలు
పిల్లల జనన ధ్రువీకరణ పత్రం
పిల్లల ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫొటో
చిరునామా రుజువు (ఆధార్ కార్డ్, ఓటరు ఐడీ లేదా యుటిలిటీ బిల్లు)