Holi Aftermath : హోలీ ఆడేటప్పుడు మీ స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్లపై రంగు పడిందా? డోంట్ వర్రీ.. ఈ 5 సేఫ్టీ టిప్స్ ద్వారా క్లీన్ చేయొచ్చు..!

Holi Aftermath : హోలీ ఆడే సమయంలో మీ స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్లపై రంగులు పడ్డాయా? ఆ రంగులను క్లీన్ చేయడం చాలా కష్టం. అయినప్పటికీ, స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్ లేదా ఇయర్‌బడ్‌లపై పడిన రంగుంలను కొన్ని సురక్షితమైన పద్ధుతుల్లో క్లీన్ చేసుకోవచ్చు.

Holi Aftermath : హోలీ ఆడేటప్పుడు మీ స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్లపై రంగు పడిందా? డోంట్ వర్రీ.. ఈ 5 సేఫ్టీ టిప్స్ ద్వారా క్లీన్ చేయొచ్చు..!

Holi Aftermath

Updated On : March 14, 2025 / 2:37 PM IST

Holi Aftermath : హోలీ పండుగ రోజున స్నేహితులు, బంధువులతో ఆనందంగా జరుపుకుంటారు. ఆ రోజుంతా రంగులను ఒకరిపై మరొకరు జల్లుకుంటూ సంతోషంగా గడుపుతారు. దాంతో ఆయా ప్రదేశాలన్నీ రంగులమాయంగా మారుతాయి.

అయితే, హోలీ ఆడే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, చాలామంది హోలీ ఆడే సమయంలో తమ స్మార్ట్ ఫోన్లతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటుంటారు. చేతికి ఖరీదైన గాడ్జెట్లను కూడా ధరిస్తుంటారు. హోలీ ఆడే సమయంలో రంగులు ఆయా స్మార్ట్ ఫోన్లు, గాడ్జెట్లపై పడుతుంటాయి.

Read Also : BSNL Recharge Plan : BSNL అత్యంత సరసమైన ప్లాన్.. హైస్పీడ్ డేటా, మరెన్నో ఓటీటీ బెనిఫిట్స్ మీకోసం.. ఇప్పుడే రీఛార్జ్ చేసుకోండి!

కొన్నిసార్లు ఫొటోలు తీసే సమయంలో చేతిలో స్మార్ట్ ఫోన్లు జారి రంగు నీళ్లలో పడిపోతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో మీ ఫోన్లు, గాడ్జెట్లు నీటిలో పడి పాడైపోతాయి. మీ స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు రంగునీళ్ల కారణంగా దెబ్బతింటాయి.

రంగులు, నీరు కూడా డివైజ్‌ల్లోకి చొరబడి భారీ నష్టాన్ని కలిగిస్తాయి. మీ డివైజ్ కూడా హోలీ రంగుల నీళ్లలో తడిసిపోతే కంగారు పడొద్దు. ఎలాంటి హాని కలగకుండా మీ గాడ్జెట్‌లను క్లీన్ చేసేందుకు 5 అద్భుతమైన సేఫ్టీ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఎండిన హోలీ రంగులపై మైక్రోఫైబర్ వస్త్రాన్ని ఉపయోగించండి :

  • మీ స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్‌వాచ్‌లో ఎండిన హోలీ రంగులు ఉంటే.. మీ చేతులతో లేదా సాధారణ గుడ్డతో తుడవకండి.
  • మృదువైన మైక్రోఫైబర్ వస్త్రాన్ని తీసుకొని డివైజ్ ఉపరితలాన్ని సున్నితంగా తుడవండి.
  • ఛార్జింగ్ పోర్ట్ లేదా స్పీకర్ గ్రిల్స్ వంటి చిన్న ఓపెనింగ్స్ నుంచి పౌడర్‌ను తొలగించి మృదువైన-బ్రిస్టల్ బ్రష్ లేదా ఎయిర్ బ్లోవర్‌ను ఉపయోగించండి.
  • ఎండిన రంగు మరకలపై నీటిని పోయొద్దు.. ఎందుకంటే రంగు డివైజ్ లోపలికి పోతుంది.

2. ఐసోప్రొపైల్ ఆల్కహాల్‌తో రంగు మరకలను క్లీన్ చేయొచ్చు : 

  • డ్రై క్లీనింగ్ సరిపోకపోతే హోలీ రంగుల మరకలు ఉంటే.. ఐసోప్రొపైల్ ఆల్కహాల్ (మెడికల్ స్టోర్లలో) అద్భుతంగా పనిచేస్తుంది.
  • మైక్రోఫైబర్ వస్త్రం మీద 70 శాతం ఐసోప్రొపైల్ ఆల్కహాల్ కొన్ని చుక్కలు వేయండి.
  • పడిన రంగును తొలగించడానికి తడిసిన చోట సున్నితంగా రుద్దండి.
  • డివైజ్ ఆన్ చేసే ముందు పూర్తిగా గాలిలో ఆరనివ్వండి.
  • మీ డివైజ్ ఏదైనా లిక్విడ్‌లో ముంచవద్దు.
  • మీరు తీసుకునే బట్టను లైటుగా తడిపి డివైజ్‌పై రుద్దండి.

3. పోర్ట్‌లు, బటన్‌ల కోసం డ్రై టూత్‌పిక్‌ని ఉపయోగించండి : 

  • హోలీ రంగులు తరచుగా ఛార్జింగ్ పోర్టులు, స్పీకర్లు లేదా బటన్లలో ఉండిపోతాయి. ఎలా శుభ్రం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
  • రంగులు పడిన చోట జాగ్రత్తగా క్లీన్ చేసేందుకు డ్రై వుడ్ టూత్‌పిక్‌ని ఉపయోగించండి.
  • గీతలు పడకుండా ఉండేందుకు టూత్‌పిక్ చుట్టూ సన్నని కాటన్‌ను చుట్టండి.
  • కంప్రెస్డ్ ఎయిర్ బాక్సు లేదా మృదువైన బ్రష్ లోపల ఏమీ లేకుండా రంగులను క్లీన్ చేయొచ్చు.
  • నీరు లేదా లోహపు పనిముట్లను ఎప్పుడూ వాడొద్దు. ఎందుకంటే డివైజ్ ఇంటర్నల్ పార్టులను దెబ్బతీస్తాయి.

4. స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌ల కోసం బేబీ వైప్స్ : 

  • మీ స్మార్ట్‌వాచ్ లేదా వైర్‌లెస్ ఇయర్‌బడ్‌లు హోలీ రంగులతో తడిస్తే.. బేబీ వైప్స్ సున్నితంగా శుభ్రపరిచవచ్చు.
  • తేలికపాటి బేబీ వైప్ తీసుకొని సున్నితంగా రుద్దండి.
  • ఆ తర్వాత మెత్తని కాటన్ వస్త్రంతో ఆరబెట్టండి.
  • మీ డివైజ్ IP68 రేటింగ్ (నీటి-నిరోధకత) ఉంటే.. తడిగా ఉన్న వస్త్రాన్ని వాడొచ్చు.
  • మీ ఇయర్‌బడ్‌లు లేదా స్మార్ట్‌వాచ్‌లు నీటి నిరోధకత కలిగినా నీటిలో ముంచరాదు.

Read Also : Tech Tips in Telugu : మీ జీమెయిల్ స్టోరేజీ మళ్లీ నిండిదా? పనికిరాని ఇమెయిల్స్ బల్క్‌గా డిలీట్ చేయొచ్చు.. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకోసం..!

5. నీళ్లలో పడిన గాడ్జెట్లకు బియ్యం బ్యాగ్ ట్రిక్ : 

  • హోలీ వేడుకల సమయంలో మీ స్మార్ట్‌ఫోన్ లేదా స్మార్ట్‌వాచ్ అనుకోకుండా తడిసిపోతే బియ్యం ట్రిక్ బాగా పనిచేస్తుంది.
  • షార్ట్ సర్క్యూట్‌లను నివారించడానికి మీ ఫోన్ వెంటనే స్విచ్ ఆఫ్ చేయండి.
  • తేమను పీల్చుకోవడానికి కనీసం 24 గంటల నుంచి 48 గంటలు రైసు బ్యాగులో ఉంచండి.
  • సిలికా జెల్ ప్యాకెట్లను (షూబాక్స్‌)లను కూడా ఉపయోగించవచ్చు.
  • మీ ఫోన్ ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్ లేదా నేరుగా సూర్యకాంతిలో పెట్టొద్దు.
  • అధిక వేడితో ఇంటర్నల్ పార్టులు దెబ్బతింటాయి.