Telugu » Technology » Holi Aftermath 5 Safe Ways To Remove Colours From Your Smartphone And Gadgets Sh
Holi Aftermath : హోలీ ఆడేటప్పుడు మీ స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్లపై రంగు పడిందా? డోంట్ వర్రీ.. ఈ 5 సేఫ్టీ టిప్స్ ద్వారా క్లీన్ చేయొచ్చు..!
Holi Aftermath : హోలీ ఆడే సమయంలో మీ స్మార్ట్‌ఫోన్లు, గాడ్జెట్లపై రంగులు పడ్డాయా? ఆ రంగులను క్లీన్ చేయడం చాలా కష్టం. అయినప్పటికీ, స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్ లేదా ఇయర్‌బడ్‌లపై పడిన రంగుంలను కొన్ని సురక్షితమైన పద్ధుతుల్లో క్లీన్ చేసుకోవచ్చు.
Holi Aftermath : హోలీ పండుగ రోజున స్నేహితులు, బంధువులతో ఆనందంగా జరుపుకుంటారు. ఆ రోజుంతా రంగులను ఒకరిపై మరొకరు జల్లుకుంటూ సంతోషంగా గడుపుతారు. దాంతో ఆయా ప్రదేశాలన్నీ రంగులమాయంగా మారుతాయి.
అయితే, హోలీ ఆడే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, చాలామంది హోలీ ఆడే సమయంలో తమ స్మార్ట్ ఫోన్లతో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటుంటారు. చేతికి ఖరీదైన గాడ్జెట్లను కూడా ధరిస్తుంటారు. హోలీ ఆడే సమయంలో రంగులు ఆయా స్మార్ట్ ఫోన్లు, గాడ్జెట్లపై పడుతుంటాయి.
కొన్నిసార్లు ఫొటోలు తీసే సమయంలో చేతిలో స్మార్ట్ ఫోన్లు జారి రంగు నీళ్లలో పడిపోతుంటాయి. ఇలాంటి సందర్భాల్లో మీ ఫోన్లు, గాడ్జెట్లు నీటిలో పడి పాడైపోతాయి. మీ స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు రంగునీళ్ల కారణంగా దెబ్బతింటాయి.
రంగులు, నీరు కూడా డివైజ్‌ల్లోకి చొరబడి భారీ నష్టాన్ని కలిగిస్తాయి. మీ డివైజ్ కూడా హోలీ రంగుల నీళ్లలో తడిసిపోతే కంగారు పడొద్దు. ఎలాంటి హాని కలగకుండా మీ గాడ్జెట్‌లను క్లీన్ చేసేందుకు 5 అద్భుతమైన సేఫ్టీ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.